News April 20, 2024
రోహిత్ మళ్లీ కెప్టెన్ అయ్యాడు: హర్భజన్

పంజాబ్‌తో మ్యాచ్‌లో రోహిత్ ముంబైకి కెప్టెన్సీ చేశారని మాజీ స్పిన్నర్ హర్భజన్ పేర్కొన్నారు. జట్టును గెలిపించేందుకు రోహిత్, హార్దిక్ కలిసి సమాలోచన చేయడం ముచ్చటగా అనిపించిందన్నారు. ‘ముంబైను చూస్తే ముచ్చటేసింది. పంజాబ్ బ్యాటింగ్ సమయంలో చివరి ఓవర్లలో రోహిత్ ఫీల్డర్లను సెట్ చేసి కెప్టెన్సీ చేశాడు. బౌలర్లతో మాట్లాడాడు. ముంబై గెలిచినప్పటికీ ఈ ఆటతో ప్లే ఆఫ్స్‌కు వెళ్లడం చాలా కష్టం’ అని అభిప్రాయపడ్డారు.
Similar News
News January 16, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 16, శుక్రవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.26 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.02 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.18 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 16, 2026
ఉద్రిక్తతల వేళ.. భారతీయులకు అలర్ట్

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. అవసరం లేని ప్రయాణాలు చేయొద్దని విదేశాంగ శాఖ అడ్వైజరీ జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో భారత ఎంబసీ హెల్ప్‌లైన్ నెంబర్లను (+972-54-7520711, +972-54-3278392) సంప్రదించాలని పేర్కొంది. మరోవైపు ఇరాన్‌లోని భారతీయులను (10,000 మంది) స్వదేశానికి తరలించే ప్రక్రియను నేటి నుంచి ప్రారంభిస్తోంది.
News January 16, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


