News July 4, 2024
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో రోహిత్, బుమ్రా

ఈ ఏడాది జూన్ నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినీలను ఐసీసీ ప్రకటించింది. భారత ప్లేయర్లు రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రాతో పాటు అఫ్గాన్ బ్యాటర్ గుర్బాజ్ ఈ అవార్డ్‌కు నామినేట్ అయ్యారు. టీ20 WCలో గుర్బాజ్ 281 రన్స్‌తో (124SR) టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచారు. ఇదే టోర్నీలో రోహిత్ శర్మ 257 రన్స్‌తో(156SR), బుమ్రా 15 వికెట్లతో రాణించి భారత్‌కు WC రావడంలో కీలక పాత్ర పోషించారు.
Similar News
News March 26, 2026
IPL: రెండో ఫేజ్ షెడ్యూల్ వచ్చేసింది

IPL-2026 రెండో ఫేజ్ షెడ్యూల్‌ను BCCI రిలీజ్ చేసింది. APR 13- MAY 24 వరకు 12 వేదికల్లో 50 లీగ్ మ్యాచులు జరగనున్నాయి. తొలి ఫేజ్ మార్చి 28 – ఏప్రిల్ 12వ తేదీ వరకు జరగనున్న విషయం తెలిసిందే. ప్లే ఆఫ్స్ మ్యాచుల షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని BCCI చెప్పింది. బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్, లక్నో, జైపూర్, ధర్మశాల, రాయ్‌పూర్, న్యూ చండీగఢ్‌లో మ్యాచులు జరగనున్నాయి.
News March 26, 2026
రేపు ‘పెద్ది’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ సినిమా నుంచి రేపు అదిరిపోయే అప్డేట్ రానుంది. ‘చరణ్ బ్యాట్ పట్టుకోవడాన్ని చూశారు. కానీ ఇప్పుడు ఆయన గదతో వస్తున్నారు’ అంటూ బుచ్చిబాబు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. శ్రీరామ నవమి సందర్భంగా రేపు 9.45AMకి వస్తున్నారంటూ ట్వీట్ చేశారు. దీంతో ఇది ఏమయ్యుంటుందా? అని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 30న ఈ చిత్రం విడుదలవనుంది.
News March 26, 2026
కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో ఉరుములతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కామారెడ్డి, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు పడే ఆస్కారముందని చెప్పింది. గంటకు 40కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.


