News June 28, 2024
కప్ సాధించేందుకు రోహిత్ పూర్తి అర్హుడు: అక్తర్

T20 WC సాధించేందుకు రోహిత్ శర్మ పూర్తి అర్హుడని పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ అన్నారు. టెస్టు ఛాంపియన్ షిప్, ODI వరల్డ్ కప్ మిస్ అయిన భారత్కు పొట్టి కప్ నెగ్గే అర్హత కచ్చితంగా ఉందన్నారు. ‘ఏమాత్రం స్వార్థం లేని ఆటగాడు రోహిత్. స్వప్రయోజనాల కంటే జట్టే ముఖ్యమని భావిస్తారు. గత ఏడాది వన్డే వరల్డ్ కప్ భారత్ ఓడినప్పుడు చాలా బాధ కలిగింది. ఆ జట్టు కప్ గెలిచేందుకు అన్ని విధాలా సరైనది’ అని పేర్కొన్నారు.
Similar News
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 23, 2025
రేపు వాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా, సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఇది వాయవ్యదిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొనసాగుతూ 48 గంటల్లో తుఫాన్గా బలపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.


