News September 18, 2024

రోహిత్ అంటే సహచరులకు చాలా గౌరవం: గంభీర్

image

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పట్ల సహచరులు అత్యంత గౌరవంగా వ్యవహరిస్తారని జట్టు కోచ్ గంభీర్ తెలిపారు. అతడి నాయకత్వంతో ఆ గౌరవాన్ని సంపాదించుకున్నారని పేర్కొన్నారు. ‘సిబ్బంది ఎంతమంది ఉన్నా జట్టు అనేది కెప్టెన్‌దే. అతడే ముందుండి నడిపించాలి. జట్టు సభ్యులందరితోనూ రోహిత్‌ బంధం బాగుంటుంది. నేను ఆడుతున్న రోజుల్లో మా ఇద్దరి మధ్య స్నేహం కూడా అద్భుతంగా ఉండేది. అతనో గొప్ప వ్యక్తి’ అని కొనియాడారు.

Similar News

News January 24, 2026

ESIC రాంచీలో 82 పోస్టులకు నోటిఫికేషన్

image

<>ESIC <<>>రాంచీ 82 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు జనవరి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS, MD/MS/DNB అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ప్రొఫెసర్ పోస్టుకు గరిష్ఠ వయసు 69ఏళ్లు కాగా.. సీనియర్ రెసిడెంట్‌కు 45ఏళ్లు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఫిబ్రవరి మొదటివారంలో ఇంటర్వ్యూ ఉంటుంది. వెబ్‌సైట్: https://esic.gov.in

News January 24, 2026

‘సింకింగ్ ఫండ్’.. అప్పుల బాధ ఉండదిక!

image

పెద్ద ఖర్చులు వచ్చినప్పుడు క్రెడిట్ కార్డులు, చేబదుళ్లపై ఆధారపడకుండా ఉండాలంటే ‘సింకింగ్ ఫండ్’ ఉత్తమ మార్గం. ఏడాదికోసారి వచ్చే బీమా ప్రీమియంలు, పండుగ ఖర్చులు లేదా పిల్లల ఫీజుల కోసం ముందే నెలకు కొంత చొప్పున పక్కన పెట్టడమే ఈ ఫండ్ లక్ష్యం. అప్పు తీసుకుని వడ్డీ కట్టే బదులు మనమే వాయిదాల్లో డబ్బు దాచుకుంటే రివర్స్‌లో మనకే బ్యాంక్ నుంచి వడ్డీ వస్తుంది. RD లేదా లిక్విడ్ ఫండ్స్ వంటివి దీనికి బెస్ట్.

News January 24, 2026

పేర్ని నాని – అనగాని మధ్య డైలాగ్ వార్

image

AP: మంత్రి అనగాని, పేర్ని నాని మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ‘సంస్కారహీనుడు, మతిస్తిమితం లేని మంత్రి రెవెన్యూ శాఖకు ఉండటం ప్రజల కర్మ. ఆయన అడిగిన రూ.25 కోట్లు జగన్‌ ఇచ్చుంటే ఇవాళ నా పక్కన ఉండేవారు’ అని పేర్ని నాని విమర్శించారు. అటు ‘తాడేపల్లి ప్యాలెస్ బయట తిరిగే డ్యాష్‌లు ఇంకా పిచ్చి మాటలు మానుకోలేదు. నా రేటేంటో వాడు చెప్పేది ఏంటి? వాడి బతుకేంటో నాకు తెలుసు’ అని అనగాని తీవ్రంగా స్పందించారు.