News January 2, 2025

రోహిత్ ఆ హక్కు సంపాదించుకున్నారు: క్లార్క్

image

రోహిత్ శర్మ రిటైర్ కావాలంటూ వస్తున్న డిమాండ్లు అర్థరహితమని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అభిప్రాయపడ్డారు. ‘రోహిత్‌ను తప్పిస్తారని నేను అనుకోవడం లేదు. గత కొన్ని మ్యాచులుగా ఆయన రికార్డ్ బాలేదని ఒప్పుకుంటా. కానీ ఎప్పుడు తప్పుకోవాలో తానే నిర్ణయించుకోగల హక్కును ఆయన ఇన్నేళ్ల ఆటతో సంపాదించుకున్నారు. మరి రోహిత్ మనసులో ఏముందో ఆయనకే తెలియాలి’ అని వ్యాఖ్యానించారు.

Similar News

News November 28, 2025

గజ్వేల్‌లో దారుణం.. అమానుష ఘటన

image

గజ్వేల్ పట్టణంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. నాలుగో బిడ్డను సాకలేనని ఓ తల్లి అబార్షన్ మాత్రలు మింగి గర్భస్రావం చేసుకుంది. గర్భస్రావం అనంతరం ఆరు నెలల నెత్తుటి గుడ్డును గజ్వేల్‌లోని రాజిరెడ్డిపల్లి పార్శి కుంట వద్ద పడేశారు. దీంతో స్థానికులు గమనించి నిలదీయడంతో నిజం ఒప్పుకున్నారు. వెంటనే గజ్వేల్ పోలీసులు తల్లి, ఆమెకు గర్భనిరోధక మాత్రలు ఇచ్చిన ఆర్ఎంపీని అరెస్ట్ చేశారు.

News November 28, 2025

మహిళల్లో ఊబకాయంతో పక్షవాతం ముప్పు

image

టీనేజ్ నుంచి అధికబరువుతో బాధపడుతున్న మహిళలకు 55 ఏళ్లలోపు పక్షవాతం వచ్చే ముప్పు పెరుగుతున్నట్లు అమెరిన్‌ స్ట్రోక్‌ అసోసియేషన్‌ పరిశోధనలో వెల్లడైంది. చిన్న వయసు నుంచి పెద్దయ్యే దాకా ఊబకాయం లేనివారితో పోలిస్తే.. ఏదో ఒక వయసులో ఊబకాయం ఉన్నవారిలో ముందుగానే పక్షవాతం వచ్చే అవకాశం ఉందని కనుగొన్నారు. దీంతోపాటు షుగర్‌, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుందని అంటున్నారు.

News November 28, 2025

గ్రీన్‌కార్డ్ ఇంటర్వ్యూకు వెళ్తే అరెస్ట్ చేస్తున్న పోలీసులు

image

గ్రీన్‌కార్డు ఇంటర్వ్యూలకు వెళ్లిన విదేశీ పౌరులను అరెస్టు చేస్తున్నారు. శాన్ డియాగోలో వీసా ఇంటర్వ్యూకు వెళ్లిన తన క్లయింట్స్ ఐదుగురిని అరెస్టు చేసినట్టు ఓ లాయర్ చెప్పారు. అరెస్టైన వారంతా US సిటిజన్ల జీవితభాగస్వాములని, వీసా గడువు ముగిసినా ఎటువంటి క్రిమినల్ కేసులు వారిపై లేవన్నారు. ఇంటర్వ్యూకు వచ్చిన వారిలో వీసా గడువు ముగిసిన వారిని అరెస్ట్ చేస్తున్నట్టు ఇమ్మిగ్రేషన్ అటార్నీ నస్సేరీ తెలిపారు.