News June 24, 2024
ఫాస్టెస్ట్ ఫిఫ్టీ ఆటగాళ్ల జాబితాలో రోహిత్

టీ20ల్లో ఫాస్టెస్ట్ 50s చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ చేరారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచులో 19 బంతుల్లో 50రన్స్ చేసిన రోహిత్.. గంభీర్(Vs శ్రీలంక, 2009) రికార్డును సమం చేశారు. ఈ జాబితాలో అగ్రస్థానంలో యువరాజ్ సింగ్ ఉన్నారు. 2007లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచులో ఆయన 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశారు. ఆ తర్వాత 18 బంతుల్లో KL రాహుల్(Vs స్కాట్లాండ్), సూర్యకుమార్(Vs SA) ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేశారు.
Similar News
News April 3, 2026
అల్లూరి: శబరి నదిలో యువకుడు గల్లంతు

అల్లూరి జిల్లాలో ఓ యువకుడు నదిలో స్నానానికి వెళ్లి గల్లంతయ్యాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు..వీఆర్‌పురం మండలం రాజుపేట కాలనీకి చెందిన బొర్రా శివ (18) శుక్రవారం శబరి నదిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ గల్లంతయ్యాడు. యువకుడు ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి చేసినట్లు చెప్పారు. విషయం తెలిసిన అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
News April 3, 2026
IPL: టాస్ గెలిచిన PBKS

చెన్నై వేదికగా CSKతో జరగనున్న మ్యాచులో PBKS టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
CSK: రుతురాజ్, శాంసన్, ఆయుష్, ప్రశాంత్ వీర్, దూబే, కార్తీక్ శర్మ, సర్ఫరాజ్, నూర్ అహ్మద్, హెన్రీ, కాంబోజ్, ఖలీల్
PBKS: ప్రభ్‌సిమ్రన్, కూపర్, శ్రేయస్, నేహాల్, శశాంక్, స్టోయినిస్, మార్కో యాన్సెన్, జేవియర్, విజయ్‌కుమార్, అర్ష్‌దీప్, చాహల్
News April 3, 2026
ఈ క్షీరదం పాలు నీటిలో కలిసిపోవు!

సముద్రపు వింతల్లో తిమింగలం పాలు ఒకటి. ఇవి ఆవు పాలలా పల్చగా ఉండవు. వెన్న మాదిరిగా గట్టిగా ఉంటాయి. ఇందులో 50% కొవ్వు ఉండటమే దీనికి కారణం. ఈ చిక్కదనం వల్ల పాలు నీటిలో కలిసిపోవు. దీనివల్ల తిమింగలం పిల్లలు నీటి అడుగున కూడా సులభంగా పాలు తాగగలుగుతాయి. ఈ అధిక కొవ్వు సముద్రపు చలిని తట్టుకోవడానికి అవసరమైన శక్తిని పిల్లలకు అందిస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో (37/100)


