News December 28, 2024
రోహిత్ ఓ విఫల కెప్టెన్, బ్యాటర్: MSK ప్రసాద్

టీమ్ ఇండియా కెప్టెన్ ఆస్ట్రేలియా పర్యటనలో పూర్తిగా నిరాశపరుస్తున్నారని బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ విమర్శించారు. ఇటు బ్యాటింగ్, అటు కెప్టెన్సీలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. ‘రోహిత్ ఆడిన మూడు టెస్టుల్లోనూ పరుగులు రాబట్టలేకపోయారు. ఫామ్ లేమితో ఆయన సతమతమవుతున్నారు. మరోవైపు కెప్టెన్సీలోనూ బౌలర్లను ఉపయోగించడంలో అంతగా ఆకట్టుకోవడం లేదు’ అని ఆయన విమర్శించారు.
Similar News
News December 11, 2025
డిస్మెనోరియా ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

మహిళలు వారి ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులు, సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కమలా పండ్లు, దాల్చిన చెక్క, హాట్ చాక్లెట్, నిమ్మరసం, డ్రై ఫ్రూట్స్, నట్స్, అల్లం, ఆకుకూరలు ఆహారంలో చేర్చుకోవడం వల్ల పీరియడ్ క్రాంప్స్ తగ్గుతాయంటున్నారు. అయినా సమస్య తగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.
News December 11, 2025
TGలో లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు: కేంద్రం

TGలో గత 10 నెలల్లో 1,40,947 రేషన్ కార్డులు రద్దయినట్లు కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వెల్లడించింది. అనర్హులు, నకిలీ కార్డుల ఏరివేత, వలసలు, వ్యక్తుల మరణాలు వంటి కారణాలతో ఈ కార్డులు రద్దు చేసినట్లు తెలిపింది. e-KYC లేదా ఆధార్ వెరిఫికేషన్ కాలేదన్న కారణంతో ఒక్క కార్డు కూడా రద్దు కాలేదని పేర్కొంది. ప్రస్తుతం TGలో మొత్తం 56.60L, APలో 88.37L రేషన్ కార్డులున్నాయి. APలో ఈ ఏడాది 50,681 కార్డులు రద్దయ్యాయి.
News December 11, 2025
గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

AP: గిద్దలూరు మాజీ MLA పిడతల రామభూపాల్ రెడ్డి(89) కన్నుమూశారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన HYDలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. రామ భూపాల్ రెడ్డి 1994లో టీడీపీ నుంచి MLAగా ఎన్నికయ్యారు. ఆయన కుమారుడు పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం వైసీపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.


