News November 16, 2024
మరోసారి తండ్రైన రోహిత్.. టీమ్ ఇండియాకు గుడ్ న్యూస్?

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్శర్మ మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి రితిక కాసేపటి క్రితం పిల్లాడికి జన్మనిచ్చారు. ఇప్పటికే వీరికి కూతురు సమైరా ఉన్నారు. ఇదిలా ఉంటే జూ.రోహిత్ వచ్చేస్తున్నాడని కొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ నెల 22న ఆస్ట్రేలియాతో జరగాల్సిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి రోహిత్ అందుబాటులో ఉంటారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే భారత జట్టుకు గుడ్ న్యూస్ కానుంది.
Similar News
News July 11, 2025
ఫీజులు పెంచాలన్న అభ్యర్థనను తిరస్కరించిన HC

TG: ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫీజులు పెంచాలన్న పలు కాలేజీల అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా ఫీజులు నిర్ణయించాలని ఫీజుల నియంత్రణ కమిటీని ఆదేశించింది. కమిటీ నిర్ణయంపైనే ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని కాలేజీలకు న్యాయస్థానం స్పష్టం చేసింది.
News July 11, 2025
చనిపోయినట్లు ప్రకటించిన 12 గంటలకు లేచిన శిశువు!

మహారాష్ట్రలో ఓ వింత సంఘటన జరిగింది. చనిపోయిందనుకున్న శిశువు 12 గంటల తర్వాత తిరిగి బతికింది. బీద్లోని రామానంద తీర్థ్ ఆస్పత్రిలో ఓ మహిళ 7వ నెలలోనే 900 గ్రాములున్న శిశువుకు జన్మనిచ్చింది. ఆ బేబీని రాత్రంతా ICUలో ఉంచి ఆ తర్వాత చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఖననం చేసే సమయంలో ముసుగు తీసి చూడగా కదలాడుతున్నట్లు కనిపించింది. వెంటనే వారు ఆ శిశువును మరో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
News July 11, 2025
రికార్డులు ఉండేది బద్దలు కొట్టడానికే: లారా

ఈసారి <<16983109>>క్వాడ్రాపుల్ సెంచరీ<<>>కి అవకాశమొస్తే బాదేయాలని వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా చెప్పినట్లు సౌతాఫ్రికా కెప్టెన్ వియాన్ ముల్డర్ తెలిపారు. ‘నీ సొంత లెగసీ సృష్టించుకోవాలి. రికార్డులు ఉండేది బద్దలు కొట్టడానికే. మళ్లీ 400 కొట్టే ఛాన్స్ వస్తే వదులుకోకు’ అని లారా చెప్పినట్లు ముల్డర్ తెలిపారు. కాగా లారా(400*) రికార్డును అధిగమించే ఉద్దేశం లేకే 367* స్కోర్ వద్ద డిక్లేర్ చేసినట్లు ముల్డర్ వెల్లడించారు.