News August 29, 2025
బ్రాంకో టెస్ట్‌కు రోహిత్ సిద్ధం.. ఎప్పుడంటే?

యోయో, బ్రాంకో టెస్టుల్లో పాసయ్యేందుకు టీమ్ ఇండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. తన ట్రైనర్ అభిషేక్ నాయర్ ఆధ్వర్యంలో జిమ్ సెషన్స్‌లో చెమటోడ్చుతున్నారు. ఎలాగైనా ఈ టెస్టులు నెగ్గాలనే కృతనిశ్చయంతో హిట్‌మ్యాన్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సెప్టెంబర్ 13వ తేదీన రోహిత్‌కు బీసీసీఐ ఎక్సలెన్స్ సెంటర్ యోయో, బ్రాంకో టెస్టు నిర్వహిస్తుందని సమాచారం.
Similar News
News August 29, 2025
GDPలో భారత్ తగ్గేదేలే

GDPలో భారత్ దూసుకెళ్తోంది. ఈ ఏడాది ఫస్ట్ క్వార్టర్(ఏప్రిల్-జూన్)లో ఇండియన్ ఎకానమీ 7.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది తొలి త్రైమాసికంలో ఇది 6.7%గా ఉంది. రియల్ జీడీపీ రూ.47.89 లక్షల కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.44.42 లక్షల కోట్లుగా ఉంది. నామమాత్రపు జీడీపీ రూ.86.05 లక్షల కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయంలో రూ.79.08 లక్షల కోట్లుగా నమోదైంది.
News August 29, 2025
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

AP: శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది. ఉత్తర బంగాళాఖాతంలో సెప్టెంబర్ 3 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, 5వ తేదీ నాటికి అది వాయుగుండంగా బలపడొచ్చని అంచనా వేసింది. దీని ప్రభావంతో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది.
News August 29, 2025
20 బంతులేసేందుకు 34,000 కి.మీ జర్నీ!

ది హండ్రెడ్ మెన్స్ లీగ్‌లో వరుసగా మూడోసారి ఓవల్ ఇన్విన్స్‌బుల్స్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ సీజన్‌లో రాణించిన బౌలర్ రషీద్ ఖాన్ జాతీయ జట్టుకు ఆడేందుకు లీగ్‌ను వీడారు. అతడి స్థానంలో ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపాను రీప్లేస్ చేసుకుంది. కాగా జంపా ఫైనల్లో 20 బంతులు వేసేందుకు ఆస్ట్రేలియా నుంచి ఇంగ్లండ్‌కు రానుపోను 34,000 కి.మీ ప్రయాణించనున్నారు. ఈ నెల 31న లార్డ్స్‌లో జరగబోయే ఫైనల్లో జంపా బరిలోకి దిగుతారు.