News February 2, 2025
CTలో రోహిత్, కోహ్లీలది కీలక పాత్ర: గంభీర్

ఇటీవల ఇంటర్నేషన్ క్రికెట్‌తోపాటు రంజీ ట్రోఫీలోనూ విఫలమైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను కోచ్ గంభీర్ వెనకేసుకొచ్చారు. వారు డ్రెస్సింగ్ రూమ్‌కే కాకుండా జట్టుకు ఎంతో విలువను చేకూరుస్తారని చెప్పారు. ఛాంపియన్స్ ట్రోఫీలో పెద్ద పాత్రను పోషించబోతున్నారన్నారు. వారిద్దరికీ పరుగుల దాహం ఉందని, దేశం కోసం ఉత్తమ ప్రదర్శన చేయడానికి ఆరాటపడుతుంటారని పేర్కొన్నారు. CTలో ప్రతి గేమ్ తమకు ముఖ్యమేనని తెలిపారు.
Similar News
News November 28, 2025
12 కాదు.. వచ్చే ఏడాది 13 మాసాలు ఉంటాయి!

సాధారణంగా ఏడాదికి 12 మాసాలే ఉంటాయి. అయితే 2026, MAR 30న మొదలయ్యే పరాభవ నామ సంవత్సరంలో 13 మాసాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. జ్యేష్ఠానికి ముందు అధిక జ్యేష్ఠం రావడమే దీనికి కారణం. ‘దీనిని పురుషోత్తమ మాసం అని పిలుస్తారు. ఇది శ్రీమహా విష్ణువుకు ప్రీతిపాత్రం. అధిక మాసంలో పూజలు, దానధర్మాలు, జపాలు చేస్తే ఎంతో శ్రేష్ఠం’ అని పండితులు సూచిస్తున్నారు. SHARE IT
News November 28, 2025
మూవీ ముచ్చట్లు

* Netflixలో స్ట్రీమింగ్ అవుతున్న హీరో రవితేజ ‘మాస్ జాతర’
* రిలీజైన వారంలోనే అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసిన రాజ్ తరుణ్ ‘పాంచ్ మినార్’ మూవీ
* నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసిన తమిళ హీరో విష్ణు విశాల్ ‘ఆర్యన్’ చిత్రం.. తెలుగులోనూ స్ట్రీమింగ్
* బాక్సాఫీస్ వద్ద గుజరాతీ చిత్రం ‘లాలో కృష్ణా సదా సహాయతే’ రికార్డులు.. రూ.50 లక్షలతో నిర్మిస్తే 49 రోజుల్లో రూ.93 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్
News November 28, 2025
పాత ఫొటోలకు కొత్త రూపం.. ట్రై చేయండి!

పాడైపోయిన, క్లారిటీ కోల్పోయిన చిన్ననాటి ఫొటోలను HD క్వాలిటీలోకి మార్చుకోవచ్చు. ‘జెమినీ AI’ను ఉపయోగించి అస్పష్టంగా ఉన్న చిత్రాలను అప్లోడ్ చేసి, సరైన ప్రాంప్ట్‌తో డిజిటల్ SLR నాణ్యతకు మార్చవచ్చు. ఇది గీతలు, మసకబారడం వంటి లోపాలను సరిచేస్తూ, రూపురేఖలను చెక్కుచెదరకుండా ఉంచి, మీ జ్ఞాపకాలను సజీవంగా అందిస్తుంది. ఈ <


