News August 12, 2024
దులీప్ ట్రోఫీలో ఆడనున్న రోహిత్, కోహ్లీ?

వచ్చే 4 నెలల్లో భారత్ 10 టెస్టులు ఆడనుంది. వీటిలో మొదటిది వచ్చే నెల 19న బంగ్లాదేశ్తో మొదలుకానుంది. ఈ నేపథ్యంలో సుదీర్ఘ ఫార్మాట్లో మళ్లీ టచ్లోకి వచ్చేందుకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దులీప్ ట్రోఫీలో ఆడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన జాతీయ జట్టు ఆటగాళ్లలో ఎక్కువ శాతం మందికి రెస్ట్ ఇచ్చినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. బంగ్లాతో టెస్టు సిరీస్కు షమీ మళ్లీ జట్టులోకి రావొచ్చని అంచనా వేశాయి.
Similar News
News December 21, 2025
డ్రాగన్ ముప్పుకు ‘ద్వీప’ కవచం: అమెరికా మాస్టర్ ప్లాన్!

A2/AD వ్యూహంతో అమెరికా నౌకలకు చైనా సవాల్ విసురుతున్న వేళ పెంటగాన్ తన పాత EABO వ్యూహానికి పదును పెడుతోంది. భారీ నౌకలపై ఆధారపడకుండా పసిఫిక్ ద్వీపాల్లోని WW-II నాటి ఎయిర్ఫీల్డ్స్ను పునరుద్ధరిస్తోంది. తద్వారా విస్తారమైన ప్రాంతంలో క్షిపణులను మోహరిస్తూ, తైవాన్ రక్షణే లక్ష్యంగా చైనా చుట్టూ ఒక రక్షణ వలయాన్ని సిద్ధం చేస్తోంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఒత్తిడిని ఎదుర్కోవడంలో ఇది కీలకంగా మారనుంది.
News December 21, 2025
ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటల సాగు

ఆయిల్ పామ్ మొక్కలు తొలి మూడేళ్లు చిన్నవిగా ఉంటాయి కాబట్టి అంతర పంటలను సాగుతో అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. కొత్తగా నాటిన మొక్కల చుట్టూ జనుము, జీలుగా, పెసర, అపరాలను 5 నుంచి 6 వరుసలుగా విత్తుకోవాలి. దీంతో తేమ ఆరిపోకుండా ఉంటుంది. పూత సమయంలో వీటిని దున్నితే సేంద్రియ పదార్థం పెరుగుతుంది. కూరగాయలు, పొట్టి అరటి, పూల మొక్కలు, మిర్చి, పసుపు, అల్లం, అనాస వంటివి అంతర పంటలుగా సాగు చేయడానికి అనువైనవి.
News December 21, 2025
జగన్కు కేసీఆర్ బర్త్డే విషెస్

తెలంగాణ భవన్లో జరుగుతున్న పార్టీ సమావేశంలో YCP చీఫ్ జగన్కు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఒక్క పాలసీ తీసుకురాలేదని, తీసుకువచ్చిన ఒకే పాలసీ రియల్ ఎస్టేట్ కోసమేనని ఫైరయ్యారు. తాను CMగా ఉన్న సమయంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రశంసించి, దాని వ్యయ పరిమితిని రూ.2L నుంచి రూ.5L పెంచితే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేస్తోందని ప్రశ్నించారు.


