News October 2, 2024

భారత జట్టుపై రోహిత్ తన ముద్ర వేశారు: మంజ్రేకర్

image

బంగ్లాతో రెండో టెస్టులో రెండున్నర రోజులే ఆడినా టీమ్ ఇండియా ఫలితం రాబట్టిన సంగతి తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడే ఆ విజయానికి కారణమని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కొనియాడారు. ‘ఈ జట్టుపై రోహిత్ తనదైన ముద్ర వేశారు. వ్యక్తిగత మైలురాళ్ల కోసం చూడకుండా దూకుడుగా ఆడి మిగిలిన ఆటగాళ్లకు శర్మ ఆదర్శంగా నిలిచారు. రోహిత్ టీమ్‌నుంచి వెళ్లిపోయాక కూడా ఆయన ప్రభావం ఈ జట్టుపై కచ్చితంగా ఉంటుంది’ అని అన్నారు.

Similar News

News November 12, 2025

ఆస్పత్రిలో చేరిన మరో సీనియర్ నటుడు

image

బాలీవుడ్ సీనియర్ నటుడు గోవింద(61) ముంబై క్రిటికేర్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న దిగ్గజ నటుడు ధర్మేంద్రను నిన్న ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన గోవింద ఇంట్లో రాత్రి సమయంలో కుప్పకూలిపోయారు. దీంతో అర్ధరాత్రి ఒంటిగంటకు ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు లీగల్ అడ్వైజర్ లలిత్ బిందాల్ తెలిపారు. ఆయనకు పలు టెస్టులు చేశారని, వాటి రిజల్ట్స్ వస్తే అనారోగ్యానికి కారణం తెలుస్తుందన్నారు.

News November 12, 2025

రేపు విచారణ.. ఇవాళ క్షమాపణ!

image

TG: నాగార్జున ఫ్యామిలీపై అభ్యంతరకర వ్యాఖ్యల విషయంలో మంత్రి కొండా సురేఖ మరోసారి <<18263475>>క్షమాపణలు<<>> చెప్పడం చర్చకు దారితీసింది. సురేఖపై నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసుపై రేపు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. అందుకే ఆమె ఒకరోజు ముందు ఆయనకు సారీ చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఈ ‘సారీ’ని స్వీకరించి నాగార్జున కేసును వెనక్కి తీసుకుంటారా? లేక ముందుకే వెళ్తారా? అనేది రేపు తేలనుంది.

News November 12, 2025

‘ఫ్రీహోల్డ్’ రిజిస్ట్రేషన్లపై నిషేధం పొడిగింపు

image

AP: ఫ్రీహోల్డ్(యాజమాన్య హక్కుల కల్పన) భూముల రిజిస్ట్రేషన్లపై నిషేధాన్ని వచ్చే ఏడాది జనవరి 11 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వైసీపీ హయాంలో ఫ్రీహోల్డ్ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం భావిస్తోంది. వీటిపై విచారణకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఓ అంచనాకు రాలేకపోవడంతో గత ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు ఏడుసార్లు నిషేధాన్ని పొడిగించారు.