News April 6, 2024
రోహిత్ అంటే ఆ మాత్రం ఉంటుంది..

రోహిత్‌శర్మ అంటే IPL జట్లకు పీడకలే. ఆయన కెప్టెన్సీలో MI 5సార్లు ట్రోఫీ గెలుచుకుంది. ఆ టీమ్ కెప్టెన్ మారిన నేపథ్యంలో CSK బ్యాటింగ్ కోచ్ హస్సీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘CSK ప్రస్తుతం ఏ జట్టు కెప్టెన్‌కు భయపడట్లేదు. గతంలో మమ్నల్ని ఫైనల్లో ఓడించే కెప్టెన్ ఉండేవారు. ఇప్పుడు ఆయన సారథిగా లేరు’ అని రోహిత్‌ను ఉద్దేశించి అన్నారు. హిట్‌మ్యాన్ అంటే ఆ మాత్రం ఉంటుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Similar News
News November 19, 2025
సేవలు – ధరలు – ఇతర వివరాలు

☞ సుప్రభాత సేవ: ఉ.3 గంటలకు ఉంటుంది. రోజుకు 250-300 టికెట్లు ఉంటాయి. ధర ₹120.
☞ తోమాల సేవ: సుప్రభాత సేవ తర్వాత ఉ.3.30కి ఉంటుంది. మంగళ, బుధ, గురు వారాల్లో 10 చొప్పున టికెట్లు మాత్రమే ఉంటాయి. ధర ఒక్కొక్కరికి ₹220.
☞ అర్చన సేవ: ఇది కూడా మంగళ, బుధ, గురు వారాల్లో 10 టికెట్లు మాత్రమే ఉంటాయి. టికెట్ ప్రైజ్ ₹220.
☞ అష్టదళ పాద పద్మారాధన: మంగళవారం మాత్రమే ఉండే ఈ సేవకు 60 టికెట్లు ఉంటాయి. ధర ₹1,250.
News November 19, 2025
అందుకే ఫైరింగ్ జరగలేదు!

AP: విజయవాడ, ఏలూరులో <<18319919>>మావోయిస్టులను<<>> పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మావోలు, పోలీసులు ఎదురుపడితే పరస్పర కాల్పులు జరుగుతుంటాయి. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో నిన్న అలా జరగలేదు. కొందరు సానుభూతిపరులను పంపి భవనాన్ని చుట్టుముట్టామని తెలియజేశారు. లొంగిపోవాలని సందేశం పంపారు. మావోలు దాచిన ఆయుధాలు బయటికి తీయకుండా దిగ్బంధించారని, దీంతో ప్రతిఘటించలేకపోయారని సమాచారం.
News November 19, 2025
ఈ జిల్లాల్లో తీవ్ర చలిగాలులు

TG: రాష్ట్రంలోని ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో ఇవాళ చలి గాలులు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొమురం భీమ్, JGL, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, ADB, NZB, కామారెడ్డి జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు అత్యల్పంగా ఉంటాయంది. నిన్న కనిష్ఠంగా సిర్పూర్లో 6.8 డిగ్రీలు నమోదైనట్లు పేర్కొంది. NOV 22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, 22 నుంచి 3 రోజులు వర్షాలు పడతాయని పేర్కొంది.


