News December 7, 2024

రోహిత్.. నో ‘హిట్’

image

భారత టెస్టు జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి విఫలమయ్యారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్సులో 6 పరుగులకే ఔటయ్యారు. కమిన్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరిగారు. తొలి ఇన్నింగ్సులోనూ 3 పరుగులకే ఔటైన సంగతి తెలిసిందే. దీంతో రోహిత్ ఫామ్‌పై ఆందోళనలు నెలకొన్నాయి.

Similar News

News November 1, 2025

అమెరికాలో ఉగ్రదాడులకు కుట్ర.. భగ్నం చేసిన ఎఫ్‌బీఐ

image

అమెరికాలో ఉగ్ర దాడుల కుట్రను భగ్నం చేసినట్లు FBI డైరెక్టర్ కాశ్ పటేల్ తెలిపారు. మిషిగన్‌లో హాలోవీన్ వీకెండ్‌లో హింసాత్మక దాడులకు ప్లాన్ చేసిన పలువురిని అరెస్టు చేసినట్లు ట్వీట్ చేశారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. FBI ఏజెంట్లు, అధికారులు దేశాన్ని రక్షిస్తున్నారని అభినందించారు. అంతకుముందు మిషిగన్‌లో FBI సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించినట్లు డియర్‌బర్న్ పోలీసులు వెల్లడించారు.

News October 31, 2025

షెఫర్డ్ హ్యాట్రిక్.. బంగ్లాతో సిరీస్ క్లీన్‌స్వీప్

image

బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో T20లో విండీస్ ఆల్‌రౌండర్ రొమారియో షెఫర్డ్ హ్యాట్రిక్ వికెట్లు తీశారు. వరుస బంతుల్లో నురుల్, తంజీద్, షొరిఫుల్‌లను ఔట్ చేశారు. తద్వారా ఈ ఫార్మాట్‌లో హ్యాట్రిక్ తీసిన రెండో WI ఆటగాడిగా నిలిచారు. గతంలో హోల్డర్ ENGపై 3 బంతుల్లో 3 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో బంగ్లా 151 పరుగులకే ఆలౌటవగా 16.5 ఓవర్లలో విండీస్ లక్ష్యాన్ని చేధించింది. దీంతో 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.

News October 31, 2025

ఇక మిగిలింది రాజగోపాల్ రెడ్డేనా..!

image

TG: సుదీర్ఘ కాలానికి CONG అధికారంలోకి రావటంతో పదవులు ఆశిస్తున్న వారు అధికంగానే ఉన్నారు. హైకమాండ్, CM రేవంత్ ఏదో రకంగా వారికి న్యాయం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు వ్యూహాత్మకంగా పోస్టుల భర్తీ చేపట్టారు. అజహరుద్దీన్‌ను మంత్రిగా, మంత్రి పదవులు కోరిన సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులను అడ్వైజర్, ఛైర్మన్‌గా నియమించారు. ఇక మిగిలింది రాజగోపాల్ రెడ్డే. ఆయనను ఎలా సంతృప్తిపరుస్తారనేది ఆసక్తికరం.