News October 4, 2024
ధోనీ కంటే రోహిత్ ఏమాత్రం తక్కువ కాదు: భజ్జీ

కెప్టెన్సీ విషయంలో ధోనీకంటే రోహిత్ శర్మ ఏమాత్రం తక్కువ కాదని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ‘వారిద్దరినీ పోల్చి చూడకూడదు. తన సహచరుల్లో గెలవాలన్న స్ఫూర్తి నింపేవాడే నిజమైన నాయకుడు. జట్టుగా ఆడే క్రీడలో అదే ముఖ్యం కూడా. ఈ విషయంలో ధోనీకంటే రోహిత్ ఏం తక్కువ కాదు. గంగూలీ, ధోనీ, కోహ్లీ, రోహిత్.. వీరంతా భారత క్రికెట్ను మరింత ముందుకు తీసుకెళ్లారు’ అని కొనియాడారు.
Similar News
News December 4, 2025
రూపాయి మరింత పతనం

రూపాయి నేలచూపులు ఆగడం లేదు. ఇవాళ మరోసారి రికార్డు కనిష్ఠ స్థాయిని తాకింది. అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 90.43కి పడిపోయింది. నిన్న 90.19 వద్ద ముగిసింది. భారత ఈక్విటీ, డెట్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండటంతో డాలర్ విలువ పెరిగి రూపాయి కిందికి పడుతోంది. ఏడాదిలో 85 నుంచి 90కి పడిపోయిందని, ఇది అత్యంత వేగవంతమైన క్షీణత అని ఎస్బీఐ తెలిపింది.
News December 4, 2025
సంక్రాంతి నుంచి ప్రభుత్వ హాస్టళ్లల్లో చేపల కూర!

TG: ప్రభుత్వ హాస్టళ్లు, క్రీడా పాఠశాలల్లోని విద్యార్థులకు చేపల కూర వడ్డించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సంక్రాంతి తర్వాత ఈ పథకం అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. మత్స్యశాఖ ఇప్పటికే సుమారు 50 కోట్ల చేపపిల్లలను చెరువుల్లో వదిలింది. చేపల ఉత్పత్తి పెరిగితే విద్యార్థులకు పంపిణీ చేసేందుకు ఇప్పటికే సర్కారు ప్రణాళికలను సిద్ధం చేసింది.
News December 4, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.220 తగ్గి రూ.1,30,360కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.200 పతనమై రూ.1,19,500 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.1,000 తగ్గి రూ.2,00,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


