News December 16, 2024

రోహిత్.. మరింత ఎనర్జీతో ఆడండి: హేడెన్

image

భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరింత ఎనర్జీతో ఆడాలని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హేడెన్ సూచించారు. దూకుడును చూపించాలని కోరారు. ‘రోహిత్ అంటే చాలా స్వేచ్ఛగా ఆడే ఆటగాడు. కానీ ఈ సిరీస్‌లో ఆయన బ్యాటింగ్ చాలా నీరసంగా ఉంటోంది. అలాంటి ప్లేయర్ బాల్‌ను డిఫెన్స్ ఆడాలని చూడకూడదు. తన సహజమైన ఆటను ఆడాలి. సోదరా.. మరింత దూకుడును చూపించండి’ అని పేర్కొన్నారు.

Similar News

News September 19, 2025

నేను రాలేదు.. కాంగ్రెస్సే నన్ను బయటకి పంపింది: తీన్మార్ మల్లన్న

image

TG: కాంగ్రెస్ నుంచి తాను బయటికి రాలేదని, ఆ పార్టీయే తనను బయటకు పంపిందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ‘ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం ముగిశాక నా ఎమ్మెల్సీ పదవి గురించి ఆలోచిద్దాం. సీఎం రేవంత్ బీసీల ద్రోహి. భూమిలేని రైతులకు రెండెకరాల భూమి ఇవ్వాలి. వరంగల్‌ను రెండో రాజధానిగా ప్రకటించాలి. తాము అధికారంలోకి వస్తే విద్య, వైద్యం ఉచితంగా అందిస్తాం’ అని తెలిపారు.

News September 19, 2025

కొత్త మేకప్ ట్రెండ్.. జంసూ

image

కొరియన్ అమ్మాయిలైనా, అబ్బాయిలైనా వాళ్ల ముఖంలో ఒక మెరుపు ఉంటుంది. అందుకే చాలామంది కొరియన్ ట్రెండ్స్‌నే ఫాలో అవుతుంటారు. వాటిల్లో కొత్తగా వచ్చిందే జంసూ. ముందుగా ముఖానికి బేబీ పౌడర్ పూసుకుని, పెద్ద గిన్నెలో చల్లటి నీళ్లు వేసి, పౌడర్ రాసుకున్న ముఖాన్ని 30 సెకన్ల పాటు ఆ నీళ్లలో ఉంచుతారు. దీని వల్ల ముఖానికి వేసుకున్న మేకప్ ఎక్కువ సేపు ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా దీన్ని ప్రయత్నించి చూడండి.

News September 19, 2025

మరో 474 పార్టీలను తొలగించిన EC

image

ఎలక్షన్ కమిషన్(EC) దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల ప్రక్షాళన చేపట్టింది. జూన్ నుంచి కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా యాక్టివ్‌గా లేని మొత్తం 808 పార్టీలను తొలగించింది. ఆగస్టు 9న 334, తాజాగా రెండో ఫేజ్‌లో 474 పార్టీలను లిస్ట్ నుంచి తీసేసింది. అత్యధికంగా UPలో 121, APలో 17 పార్టీలపై వేటు పడింది. ఆరేళ్లుగా ఎన్నికల్లో పోటీ చేయని పార్టీలను EC తొలగిస్తోంది. 3వ ఫేజ్‌లో 359 పార్టీలు పరిశీలనలో ఉన్నాయి.