News August 10, 2024
రోహిత్ శర్మ 24 క్యారెట్ల బంగారం: ఆకాశ్ చోప్రా

టీమ్ ఇండియా వన్డే/టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించారు. రోహిత్ చాలా మంచి మనిషంటూ ఆకాశానికెత్తేశారు. ‘ఆటగాడిగానే కాదు, మనిషిగానూ రోహిత్ అద్భుతం. తను మంచివాడు కాదని చెప్పిన ఒక్క వ్యక్తిని కూడా నేను చూడలేదు. 24 క్యారెట్ల బంగారం ఆయన’ అని కొనియాడారు. టీ20ఐ నుంచి రిటైరైన రోహిత్ ప్రస్తుతం వన్డే, టెస్టు ఫార్మాట్లలో మాత్రమే కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
Similar News
News January 28, 2026
నం.1లో అభిషేక్.. టాప్-10లోకి సూర్య

NZతో జరుగుతున్న సిరీస్లో రాణిస్తున్న ఓపెనర్ అభిషేక్ శర్మ టీ20 ICC ర్యాంకింగ్స్లో 929 పాయింట్లతో నం.1 స్థానంలో కొనసాగుతున్నారు. రెండో స్థానంలో ఉన్న సాల్ట్కు అతనికి 80 పాయింట్ల గ్యాప్ ఉంది. మరోవైపు ఇదే సిరీస్లో ఫామ్ అందుకున్న కెప్టెన్ SKY 5 స్థానాలు ఎగబాకి నం-7లోకి వచ్చారు. అటు తిలక్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. T20 బౌలర్లలో 787 పాయింట్లతో వరుణ్ నం.1లో స్థానంలో కంటిన్యూ అవుతున్నారు.
News January 28, 2026
2.0లో కార్యకర్తలకు టాప్ ప్రయారిటీ: జగన్

AP: దుర్మార్గపు పాలన చేస్తున్న చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని మాజీ CM జగన్ పేర్కొన్నారు. ‘ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తా. 150 నియోజకవర్గాల్లో పర్యటిస్తా. CBN తప్పుడు పాలనను ప్రజలకు వివరిద్దాం. ప్రతి ఇంట్లో చర్చ జరిగేలా పార్టీనేతలు చొరవ చూపాలి. క్రితంసారి కొవిడ్ వల్ల పాలనపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వచ్చింది. 2.0లో కార్యకర్తలకు అధిక ప్రాధాన్యం ఇస్తా. ఇది నా హామీ’ అని జగన్ వివరించారు.
News January 28, 2026
తన జీతం ఎంతో చెప్పిన SBI PO.. నెట్టింట చర్చ!

తన జీతం గురించి ఓ SBI PO చెప్పిన విషయాలు నెట్టింట చర్చకు దారితీశాయి. ‘2022లో PO(ప్రొబెషనరీ ఆఫీసర్)గా ఎంపికయ్యా. నా జీతం ₹95 వేలు. 2.5 ఏళ్లలో 5 ఇంక్రిమెంట్లు వచ్చాయి’ అని తెలిపారు. అలవెన్సుల కింద మరో ₹29 వేలు వస్తాయని చెప్పారు. 2.5ఏళ్లకే ₹లక్షకు పైగా జీతం వస్తే రిటైర్మెంట్ టైమ్కు ఇంకెంత వస్తుందోనని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కొందరు అభినందిస్తుండగా, ఇది ఎలా సాధ్యమని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.


