News August 4, 2024

సచిన్ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ

image

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక 50+ స్కోర్లు చేసిన భారత ఓపెనర్‌గా సచిన్(120) పేరిట ఉన్న రికార్డును రోహిత్ శర్మ(121) బ్రేక్ చేశారు. తాజాగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో ఈ ఘనతను అందుకున్నారు. అలాగే వన్డేల్లో తొలి పది ఓవర్లలోపు అత్యధిక ఫిఫ్టీలు కొట్టిన భారత బ్యాటర్ల లిస్టులో హిట్‌మ్యాన్(4) రెండో స్థానంలో ఉన్నారు. సెహ్వాగ్(7) తొలి స్థానంలో కొనసాగుతున్నారు.

Similar News

News December 1, 2025

నేవీ అధికారి భార్యను రైలు నుంచి తోసేసిన TTE!

image

యూపీలో నేవీ అధికారి భార్య మృతి కేసులో రైల్వే టీటీఈపై కేసు నమోదైంది. నవంబర్ 26న వైద్యం కోసం ఢిల్లీకి బయలుదేరిన ఆర్తి(30) పొరపాటున మరో ట్రైన్ ఎక్కారు. టికెట్ విషయమై ఆర్తికి TTEతో వివాదం తలెత్తగా లగేజ్‌తో పాటు ఆమెను బయటకు తోసేశాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే చనిపోయిందన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో ఘటనపై ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నట్లు GRP అధికారులు తెలిపారు.

News December 1, 2025

పెళ్లి చేసుకున్న సమంత!

image

స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు పెళ్లి చేసుకున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇవాళ ఉదయం కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో వీరిద్దరి వివాహం జరిగినట్లు వెల్లడించాయి. ఈ కపుల్‌కు పలువురు సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్నారు. కాగా పెళ్లికి సంబంధించి ఈ జోడీ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుందని సినీ వర్గాలు పేర్కొన్నాయి.

News December 1, 2025

యువతకు ‘గీత’ చెప్పిన కర్మ సిద్ధాంతం ఇదే!

image

నేటి యువతరం భగవద్గీత నుంచి కర్మ సిద్ధాంతాన్ని నేర్చుకోవాలి. లక్ష్యంపై దృష్టి పెట్టి, ఫలితంపై ఆందోళన చెందకుండా తమ పనిని నిస్వార్థంగా చేయాలని గీత బోధిస్తుంది. మంచి జరిగినా, చెడు జరిగినా రెండింటినీ జీవితంలో భాగమే అనుకొని, ఏకాగ్రతతో నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం, సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించాలి. ఈ ఆత్మవిశ్వాసం, నిలకడ నేటి పోటీ ప్రపంచంలో విజయానికి కీలకం. SHARE IT