News March 30, 2025

చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ

image

IPLలో నిన్న గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ ఆడటం ద్వారా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించారు. టీ20 క్రికెట్‌(IPL+దేశవాళీ+ఇంటర్నేషనల్)లో 450 మ్యాచ్‌లు ఆడిన తొలి భారత ప్లేయర్‌గా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో దినేశ్ కార్తీక్(412), విరాట్ కోహ్లీ(401), ధోనీ(393), సురేశ్ రైనా(336) ఉన్నారు. ఓవరాల్‌గా కీరన్ పొలార్డ్(695), బ్రావో(582), షోయబ్ మాలిక్(555), రస్సెల్(540), నరైన్(537) తొలి ఐదు స్థానాల్లో ఉన్నారు.

Similar News

News November 7, 2025

జీపీఎస్ స్పూఫింగ్ అంటే?

image

GPS స్పూఫింగ్ అనేది ఒక సైబర్ అటాక్. GPS సిగ్నల్‌‌లను మానిప్యులేట్ చేసి నావిగేషన్ వ్యవస్థలను తప్పుదారి పట్టిస్తారు. ఇలా ఫేక్ శాటిలైట్ సిగ్నల్‌లను ప్రసారం చేయడంతో విమానాలు ఫాల్స్ రూట్లలో వెళ్లే అవకాశముంది. ఓ చోట ఉన్న ఫ్లైట్ మరో చోట ఉన్నట్లు చూపిస్తుంది. దీని వల్ల ఫ్లైట్స్ టేకాఫ్/ల్యాండింగ్ అయ్యేటప్పుడూ ప్రమాదాలకు ఆస్కారముంటుంది. <<18227103>>ఢిల్లీ<<>>, ముంబైలో విమాన సేవల అంతరాయానికి ఇదే కారణమనే అనుమానాలున్నాయి.

News November 7, 2025

ప్రేమికుడిపై కక్షతో ఫేక్ మెయిల్స్… చివరకు జైలు

image

ప్రేమ విఫలమైన ఓ యువతి ప్రేమికుడి పేరిట ఫేక్ బాంబు బెదిరింపు మెయిల్స్ పంపి కటకటాల పాలైంది. రోబోటిక్ ఇంజినీర్ రెనా జోషిల్డా(గుజరాత్‌) ప్రభాకర్ అనే సహచరుడిని ప్రేమించింది. అయితే ఆయన మరో పెళ్లి చేసుకోగా కక్షగట్టింది. ఆయన వర్చువల్ నంబర్‌తో అనేక రాష్ట్రాల స్కూళ్లు, కోర్టులు, స్టేడియాల్ని పేల్చేస్తున్నట్లు రెనా మెయిల్స్ పంపింది. 21 ప్రాంతాల్లో పోలీసులను పరుగులు పెట్టించి చివరకు బెంగళూరులో అరెస్టైంది.

News November 7, 2025

తేనె మోతాదు మించితే మహా ప్రమాదం

image

ఆరోగ్యానికి మంచిదని ఇటీవల తేనెను ఎక్కువమంది స్వీకరిస్తున్నారు. అయితే దాని మోతాదు మించితే మొదటికే మోసమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులోని అధిక ఫ్రక్టోజ్ వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. శరీరంలోని విషపదార్థాల తొలగింపులో కాలేయానిది ప్రధాన పాత్ర. అధిక తేనెతో దానిలో కొవ్వు పేరుకుపోయి పనితీరును నష్ట పరుస్తుంది. ఫలితంగా ఇతర సమస్యలూ వస్తాయి. అధిక క్యాలరీలు, కార్బోహైడ్రేట్స్ వల్ల బరువు పెరుగుతారు.