News March 17, 2025
కూతురితో రోహిత్ శర్మ CUTE PHOTOS

IPL 2025కు ముందు దొరికిన కాస్త విరామాన్ని రోహిత్ శర్మ కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవులు టూర్‌లో గడిపేస్తున్నారు. ఈ క్రమంలో ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. తాజాగా కూతురు సమైరాతో దిగిన ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీటిని షేర్ చేస్తూ CUTE PHOTO అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Similar News
News March 17, 2025
Stock Markets: భారీ లాభాల్లో మొదలవుతాయా!

దేశీయ స్టాక్‌మార్కెట్లు రేంజుబౌండ్ నుంచి పాజిటివ్‌గా మొదలవ్వొచ్చు. గిఫ్ట్‌నిఫ్టీ 150 పాయింట్ల లాభంతో ట్రేడవుతుండటం దీనినే సూచిస్తోంది. జకార్తా మినహా ఆసియా మేజర్ సూచీలన్నీ ఎగిశాయి. నిఫ్టీ రెసిస్టెన్సీ 22,513, సపోర్టు 22,375 వద్ద ఉన్నాయి. మెటల్, కమోడిటీస్, చమురు, CPSE, ఎనర్జీ, ఇన్ఫ్రా రంగాల్లో మూమెంటమ్ కనిపిస్తోంది. Stocks to Focus: ఇండస్‌ఇండ్, KEC, వెల్‌స్పన్, ఆల్కెమ్, శిల్పా మెడికేర్, Dr రెడ్డీస్
News March 17, 2025
పరీక్షలే జీవితం కాదు.. ఆల్ ది బెస్ట్: హోంమంత్రి

AP: పబ్లిక్ పరీక్షల వేళ విద్యార్థులు టెన్షన్ పడొద్దని హోంమంత్రి అనిత సూచించారు. ‘జీవితంలో పదోతరగతి పరీక్షలు కీలకమే. కానీ అవే జీవితం కాదు. ఏడాదిపాటు నిద్రపోకుండా చదివిన మీ కష్టాన్ని ప్రతిబింబించేలా ప్రతి ప్రశ్నకు నైపుణ్యంతో జవాబు రాయండి. కేంద్రానికి ముందుగానే వెళ్లి మనసుని ప్రశాంతంగా ఉంచుకుని పరీక్షలు బాగా రాయండి. ఆల్ ది బెస్ట్’ అని ట్వీట్ చేశారు.
News March 17, 2025
నేడు ఏపీ క్యాబినెట్ భేటీ

AP: రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం 3గంటలకు సచివాలయంలో మంత్రులు భేటీ కానున్నారు. సీఆర్‌డీఏ ఆమోదించిన రూ.37,702 కోట్ల టెండర్ల పనులను ఈ సమావేశంలో ఆమోదించనున్నారు. అదే విధంగా స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు 4వ సమావేశంలో ఆమోదించిన అంశాలపైనా చర్చించి వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.