News June 27, 2024
రోహిత్ శర్మకు సిక్స్ ప్యాక్ అక్కర్లేదు: కపిల్ దేవ్

టీమ్ ఇండియాలో రోహిత్, కోహ్లీ ఇద్దరూ దిగ్గజాలేనని, ఒకరితో ఒకరిని పోల్చి చూడొద్దని వారి ఫ్యాన్స్‌కు మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ సూచించారు. ‘కోహ్లీ ఫిట్నెస్ ఇష్టపడతారు. తన వల్ల జట్టులో ఫిట్‌నెస్‌పై ఆసక్తి పెరిగింది. రోహిత్ జిమ్ పెద్దగా ఇష్టపడరు. అయినా ఫిట్‌గానే ఉన్నారు. అద్భుతంగా ఆడుతున్నారు. ఎవరి శైలి వారిది. రోహిత్‌కు సిక్స్ ప్యాక్ అక్కర్లేదు. ఒక్క ప్యాక్ ఉన్నా సిక్సులు కొడతారు’ అని పేర్కొన్నారు.
Similar News
News October 27, 2025
సింగర్ మృతి.. చివరి సినిమాకు భారీ క్రేజ్

అస్సామీ సింగర్ జుబీన్ గార్గ్ SEP 19న సింగపూర్‌లో <<17805488>>మృతిచెందిన<<>> సంగతి తెలిసిందే. ఆయన లీడ్ రోల్ నటించి, మ్యూజిక్ అందించిన చివరి సినిమా ‘రోయ్ రోయ్ బినాలే’ OCT 31న విడుదలవుతోంది. టికెట్ బుకింగ్స్ ప్రారంభం కాగా గంటలోనే 15K+ అమ్ముడయ్యాయి. BMSలో ఇప్పటివరకు 98K+ ఇంట్రస్ట్‌లు నమోదయ్యాయి. దీంతో ఇది ₹100CR గ్రాస్ కలెక్షన్స్ సాధించే తొలి అస్సామీ సినిమాగా నిలిచే అవకాశం ఉందని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి.
News October 27, 2025
పథకాలపై నివేదికలు ఇవ్వాలని సీఎం ఆదేశాలు

TG: కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తికానున్న సందర్భంగా వివిధ శాఖల పరిధిలో అమలవుతున్న పథకాలపై నివేదికలు ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న హామీల అమలుకు ఎంత ఖర్చవుతుంది, ప్రభుత్వంపై పడే అదనపు ఆర్థిక భారమెంత, నిధులను ఎలా సమకూర్చాలి వంటి అంశాలపై రోడ్‌మ్యాప్ రూపొందించాలని సూచించారు. ఈ నివేదికల ఆధారంగా భవిష్యత్ కార్యాచరణను ప్లాన్ చేసుకోవచ్చని భావిస్తున్నట్లు సమాచారం.
News October 27, 2025
ఏజ్ కాదు.. ఇంటెంట్ మ్యాటర్: రహానే

టీమ్ ఇండియా సెలక్టర్లపై రహానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఆటలో ఏజ్ కాదు.. ఇంటెంట్ మ్యాటర్. అనుభవమున్న, డొమెస్టిక్ క్రికెట్లో రాణిస్తున్న నా లాంటి ప్లేయర్లను సెలక్టర్లు కన్సిడర్ చేయాలి. కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు ఎక్కువ ఛాన్సులివ్వాలి. కానీ వారి నుంచి సరైన కమ్యునికేషన్ లేదు. సెలెక్ట్ చేసినా చేయకపోయినా గేమ్‌ను ఆస్వాదిస్తా. BGT 2024-25లో టీమ్‌కు నా అనుభవం పనికొచ్చేది’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.


