News March 18, 2024
నేడు ముంబై క్యాంపులోకి రోహిత్ శర్మ

టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇవాళ ముంబై ఇండియన్స్ ట్రైనింగ్ క్యాంపులో చేరనున్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి. గత కొన్ని నెలలుగా ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచులతో బిజీగా ఉన్న హిట్‌మ్యాన్.. క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకున్నారు. మరో 4 రోజుల్లో ఐపీఎల్-2024 ప్రారంభం కానున్న నేపథ్యంలో నేడు జట్టుతో చేరనున్నారు. ఈ సారి ముంబై కెప్టెన్‌గా హార్దిక్ వ్యవహరించనుండగా, రోహిత్ బ్యాటర్‌గా ఆడనున్నారు.
Similar News
News February 17, 2026
AIIMS రిషికేశ్‌లో ఉద్యోగాలు

<
News February 17, 2026
గుడ్‌న్యూస్.. వారికీ ఇందిరమ్మ ఇళ్లు!

TG: ఉమ్మడి APలో, గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణం పూర్తికాని లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వారికి ఇందిరమ్మ ఇళ్ల కింద సాయం చేయాలని నిర్ణయించింది. గతంలో ఇళ్లు మంజూరై బేస్‌మెంట్ దాకా కట్టగానే ప్రభుత్వాలు మారడంతో నిర్మాణాలు పూర్తి కాలేదు. ఇలాంటి వాళ్లు 9 వేల మంది వరకు ఉన్నారని తేలింది. బేస్‌మెంట్ ఖర్చు రూ.లక్ష మినహాయించి, మిగతా రూ.4 లక్షల దాకా ప్రభుత్వం వారికి అందజేయనుంది.
News February 17, 2026
అధిక మాసంలో ఏమేం చేయవచ్చు?

అధిక మాసాన్నే పురుషోత్తమ మాసం అంటారు. ఇది ఆధ్యాత్మిక సాధనకు మహత్తర సమయం. ఈ మాసానికి విష్ణువు అధిపతి. అందుకే జపతపాలు, ధ్యానానికి ప్రాధాన్యం. ఆయన నామస్మరణతో కోటి రెట్ల ఫలితం లభిస్తుంది. ఆత్మదర్శనానికి, భగవంతుని స్మరించడానికి ఇది అనుకూలమైన కాలం. ఈ మాసంలో శక్తి మేరకు అన్నదానం, విద్యాదానం చేయడం విశేష పుణ్యప్రదం. కొత్త శుభకార్యాలు నిషిద్ధమైనా, నిరంతర భగవన్నామ స్మరణతో, దానధర్మాలతో దైవకృపను పొందవచ్చు.


