News June 30, 2024

రోహిత్ శర్మ అరుదైన రికార్డు

image

టీ20ల్లో రోహిత్ శర్మ రికార్డు సృష్టించారు. కెప్టెన్‌గా 50 మ్యాచుల్లో జట్టుని గెలిపించిన అరుదైన ఫీట్ సాధించారు. ఆ తర్వాత బాబర్ ఆజమ్(48 మ్యాచ్‌లు, పాక్), బ్రెయిన్ మసాబా(45, ఉగాండా), మోర్గాన్( 44, ఇంగ్లండ్) ఉన్నారు. మరోవైపు రెండు టీ20 WC విజయాల్లో భాగమైన తొలి భారత క్రికెటర్‌గా రోహిత్ నిలిచారు. 2007 ఆరంభ టీ20 వరల్డ్ కప్ భారత జట్టులో రోహిత్ ఒకరు. ఆ టోర్నీలోనూ భారత్ విశ్వవిజేతగా నిలిచింది.

Similar News

News April 19, 2026

పుష్ప-2 రికార్డు బ్రేక్ చేసిన ధురంధర్-2

image

రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్-2 సినిమా మరో మైలురాయిని దాటేసింది. అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ చిత్రాల జాబితాలో పుష్ప-2(₹1,742Cr)ను బీట్ చేసింది. ₹1748Cr కలెక్షన్లతో మూడో స్థానానికి చేరింది. తొలి రెండు స్థానాల్లో దంగల్(₹2,090Cr), బాహుబలి:2(₹1,788Cr) ఉన్నాయి. కాగా ఇప్పటికే ₹3,000+Cr గ్రాస్ వసూళ్లు రాబట్టిన తొలి భారతీయ ఫ్రాంచైజీగా ‘ధురంధర్’ రికార్డులకెక్కిన విషయం తెలిసిందే.

News April 19, 2026

ఏపీ విభజన వ్యాఖ్యల వివాదం.. తేజస్వీ సూర్య ఏమన్నారంటే?

image

తెలంగాణను ఉద్దేశించి లోక్‌సభలో తాను చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీయడంపై BJP MP తేజస్వీ సూర్య స్పందించారు. ‘కాంగ్రెస్ నిరక్షరాస్యుల పార్టీ. నేనేం మాట్లాడానో ఆ పార్టీ నేతలు మళ్లీ వినండి. ఆ సింపుల్ మాటలను వీలైతే అర్థం చేసుకోండి. INC లీడర్లు ఉద్దేశపూర్వకంగా, అజ్ఞానంతో నిరసన తెలుపుతున్నారు’ అని మీడియాతో వ్యాఖ్యానించారు. ఉమ్మడి APని IND, PAK తరహాలో విభజించారని తేజస్వీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

News April 19, 2026

కాసేపట్లో వర్షం..

image

TG: సిరిసిల్ల, జగిత్యాల, సంగారెడ్డి జిల్లాల్లో రాబోయే రెండు గంటల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. అలాగే వికారాబాద్, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో సాయంత్రం వానలు పడతాయని చెప్పారు. ఇక హైదరాబాద్‌లో సాయంత్రం లేదా రాత్రి వర్షం పడొచ్చని పేర్కొన్నారు. అటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు.