News February 16, 2025

రోహిత్ శర్మ నిస్వార్థమైన నాయకుడు: అశ్విన్

image

భారత కెప్టెన్ రోహిత్ శర్మ నిస్వార్థమైన నాయకుడని మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసించారు. ‘రోహిత్ కెప్టెన్సీలోనే మేం వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌కి వెళ్లాం. టీ20 వరల్డ్ కప్ గెలిచాం. అతడికి అసలు స్వార్థమనేది ఉండదు. వన్డేల్లో పవర్ ప్లేలో అతడు ఆడుతున్న ఆటే అందుకు నిదర్శనం. జట్టుకోసం చాలాసార్లు మైలురాళ్లను వదిలేసుకున్నాడు. అందుకే అతడంటే నాకు అపారమైన గౌరవం’ అని స్పష్టం చేశారు.

Similar News

News November 5, 2025

ఈ పరిహారాలు పాటిస్తే.. డబ్బు కొరత ఉండదట

image

కార్తీక పౌర్ణమి పర్వదినాన రావిచెట్టు ఎదుట దీపారాధన చేస్తే కష్టాలు తొలగి, ఇంట్లో శాంతి, ఆనందం ఉంటాయని పండితులు చెబుతున్నారు. నదిలో దీపం వెలిగిస్తే మోక్షం లభిస్తుంది. పాలు కలిపిన నీటిని తులసి మొక్కకు పోయాలి. విష్ణువుకు తిలకం దిద్ది, నువ్వుల నైవేద్యం పెట్టాలి. నేడు అన్నదానం, వస్త్రదానాలు వంటివి చేస్తే.. పేదరికం నుంచి విముక్తి లభిస్తుంది. డబ్బు కొరతే కాక ఆహారం, నీటి కొరత లేకుండా పోతుందని నమ్మకం.

News November 5, 2025

మగాళ్లకూ పీరియడ్స్ వస్తే అమ్మాయిల బాధ అర్థమవుతుంది: రష్మిక

image

జగపతి బాబు హోస్ట్‌గా చేస్తున్న ఓ టాక్ షోలో హీరోయిన్ రష్మిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘మగాళ్లకూ పీరియడ్స్ వస్తే బాగుండేది. అప్పుడు వాళ్లకు మహిళలు అనుభవించే నొప్పి, బాధ, అసౌకర్యం ఏంటో అర్థమయ్యేది’ అని అన్నారు. రష్మిక కామెంట్లపై జగపతి బాబు చప్పట్లు కొట్టి అభినందించారు.

News November 5, 2025

సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సమర్థవంతంగా పనిచేసే క్యాన్సర్ ఔషధం!

image

నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ (US) సైంటిస్టులు కీమోథెరపీ ఔషధాన్ని నానోటెక్నాలజీతో పునఃరూపకల్పన చేసి క్యాన్సర్ చికిత్సలో పెనుమార్పు తీసుకొచ్చారు. దుష్ప్రభావాలు కలిగించే 5-ఫ్లోరోయురాసిల్ (5-Fu) ఔషధాన్ని, స్ఫెరికల్ న్యూక్లియిక్ యాసిడ్ (SNA)గా మార్చారు. ఇది లుకేమియా కణాలను 20,000 రెట్లు ప్రభావవంతంగా నాశనం చేస్తుంది. ఇది ఆరోగ్యకరమైన కణజాలానికి హాని చేయకుండా క్యాన్సర్ కణాలనే లక్ష్యంగా చేసుకుంటుంది.