News November 6, 2024
రోహిత్ శర్మ రిటైర్ కావొచ్చు: శ్రీకాంత్

ఆస్ట్రేలియాతో జరిగే BGTలో విఫలమైతే రోహిత్ టెస్టులకు గుడ్‌బై చెప్పొచ్చని మాజీ భారత కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. ‘రోహిత్ స్థానాన్ని భర్తీ చేసేందుకు BCCI ప్రయత్నాలు మొదలుపెట్టాలి. అతడి వయసు పెరుగుతున్న విషయం దృష్టిలో పెట్టుకోవాలి. కివీస్ సిరీస్‌లో ఆడలేదని రోహిత్ అంగీకరించడం గ్రేట్. అతను గాడినపడేలా కనిపిస్తున్నాడు. ఒకవేళ విఫలమైతే అతడే తప్పుకుంటాడు’ అని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.
Similar News
News November 13, 2025
ఇండియా A విజయం

సౌతాఫ్రికా Aతో జరిగిన తొలి అనధికార వన్డేలో ఇండియా A విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 9 వికెట్లు కోల్పోయి 285 రన్స్ చేసింది. అనంతరం భారత్ 49.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (117) సెంచరీతో అదరగొట్టారు. తిలక్ వర్మ 39, నితీశ్ 37, అభిషేక్ శర్మ 31 రన్స్ చేశారు.
News November 13, 2025
ఉచితంగానే సదరం స్లాట్ బుకింగ్, సర్టిఫికెట్: సత్యకుమార్ యాదవ్

AP: దివ్యాంగుల పెన్షన్ కోసం సదరం స్లాట్ బుకింగ్ రేపట్నుంచి ప్రారంభమవుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇప్పటికే స్లాట్ బుకింగ్ చేసుకున్న 10వేల మందికి తొలి ప్రాధాన్యమిస్తామన్నారు. దివ్యాంగుల ఆర్థికస్థితిని పరిగణనలోకి తీసుకొని స్లాట్ బుకింగ్, సర్టిఫికెట్ ముద్రణకు గతంలో ₹40 చొప్పున ఉన్న ఫీజును రద్దు చేసినట్లు చెప్పారు. సదరం సర్టిఫికెట్ల ఆధారంగానే కొత్త పెన్షన్లను అధికారులు మంజూరు చేస్తారు.
News November 13, 2025
హైదరాబాద్ మెట్రో: 4, 6 కోచ్‌లతో రైళ్లు!

TG: హైదరాబాద్ మెట్రోలో రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో 4, 6 కోచ్‌ల రైళ్లను ప్రవేశపెట్టాలని HMRL యోచిస్తోంది. ఇందుకోసం 40-60 కోచ్‌లను తీసుకురానున్నట్లు HMRL ఎండీ సర్ఫరాజ్ తెలిపారు. ప్రస్తుతం 3 మార్గాల్లో 3 కోచ్‌లతో 56 రైళ్లు తిరుగుతున్నాయని పేర్కొన్నారు. వీటిలో ఎలాంటి మార్పులు చేయకుండా కొత్తగా 4, 6 కోచ్‌లతో ట్రైన్లను తీసుకొస్తామని వివరించారు. ఇందుకు రెండేళ్లకు పైగా సమయం పట్టొచ్చని చెప్పారు.


