News April 11, 2024
లక్నోకు రోహిత్ శర్మ.. కోచ్ ఏమన్నారంటే?

రోహిత్‌ను LSG దక్కించుకోనుందంటూ వస్తున్న వార్తలపై ఆ జట్టు కోచ్ లాంగర్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. వేలంలో ఏ ఆటగాడిని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అడగ్గా ‘నేను ఎవరి పేరు చెబుతానని మీరనుకుంటున్నారు?’ అని ఆయన తిరిగి ప్రశ్నించారు. ‘రోహిత్‌ను జట్టులోకి తీసుకోగలరా?’ అని అనడంతో ఆశ్చర్యపోయిన లాంగర్ ‘ఏంటీ.. రోహిత్ శర్మనా? OK. మేం అతడిని తీసుకుంటాం. మీరే ఈ డీల్ కుదర్చగలరు’ అని నవ్వుతూ సమాధానమిచ్చారు.
Similar News
News November 22, 2025
వరికి మానిపండు తెగులు ముప్పు

వరి పంట పూత దశలో ఉన్నప్పుడు గాలిలో అధిక తేమ, మంచు, మబ్బులతో కూడిన వాతావరణం ఉంటే మానిపండు తెగులు లేదా కాటుక తెగులు ఆశించడానికి, వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దీని వల్ల వెన్నులోని గింజలు తొలుత పసుపుగా తర్వాత నల్లగా మారతాయి. తెగులు కట్టడికి వాతావరణ పరిస్థితులనుబట్టి సాయంకాలపు వేళ.. 200 లీటర్ల నీటిలో ఎకరాకు ప్రాపికొనజోల్ 200ml లేదా క్లోరోథలోనిల్ 400 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి.
News November 22, 2025
పాక్ ప్లాన్‌ను తిప్పికొట్టిన భారత్-అఫ్గాన్

ఇండియా, అఫ్గాన్ మధ్య దౌత్యమే కాకుండా వాణిజ్య సంబంధాలు కూడా బలపడుతున్న విషయం తెలిసిందే. దీనిని తట్టుకోలేని పాకిస్థాన్ వారి రోడ్డు మార్గాన్ని వాడుకోకుండా అఫ్గాన్‌కు ఆంక్షలు విధించింది. పాక్ ఎత్తుగడకు భారత్ చెక్ పెట్టింది. అఫ్గాన్ నుంచి సరుకు రవాణాకు ప్రత్యామ్నాయంగా జల, వాయు మార్గాలను ఎంచుకుంది. ఇరాన్ చాబహార్ పోర్టు నుంచి జల రవాణా, కాబుల్ నుంచి ఢిల్లీ, అమృత్‌సర్‌కు కార్గో రూట్లను ప్రారంభించింది.
News November 22, 2025
వెహికల్ చెకింగ్‌లో ఈ పత్రాలు తప్పనిసరి!

పోలీసులు వాహనాల తనిఖీ సమయంలో ఏయే పత్రాలను చెక్ చేస్తారో చాలా మందికి తెలిసుండదు. చెకింగ్ సమయంలో మీ వద్ద డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్‌తో పాటు పొల్యూషన్ సర్టిఫికెట్ కూడా ఉండేలా చూసుకోండి. కమర్షియల్ వాహనమైతే పైన పేర్కొన్న వాటితో పాటు పర్మిట్ & ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉండాలి. తెలుగు రాష్ట్రాల వాహనదారులు mParivahan లేదా DigiLocker యాప్‌లలో డిజిటల్ రూపంలో ఉన్న పత్రాలను చూపించవచ్చు. SHARE IT


