News July 7, 2024
రోహిత్ శర్మ వెళ్లాడు.. అభిషేక్ శర్మ వచ్చాడు

WC గెలిచిన తర్వాత రోహిత్ శర్మ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. అయితే జింబాబ్వేతో రెండో టీ20లో సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ ఆ లోటును తీరుస్తాడంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. పైగా రోహిత్ లాగే అభిషేక్ కూడా తొలి సెంచరీ జింబాబ్వేపైనే చేయడం విశేషం. ఇద్దరూ సిక్స్తోనే సెంచరీ పూర్తిచేయడం మరో హైలైట్. భవిష్యత్తులో రోహిత్ స్థానాన్ని అభిషేక్ భర్తీ చేస్తారా? కామెంట్ చేయండి.
Similar News
News December 13, 2025
అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.
News December 13, 2025
NIT ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు

<
News December 13, 2025
ఈ వాతావరణం కనకాంబరం సాగుకు అనుకూలం

అధిక తేమ, వేడి కలిగిన ప్రాంతాలు కనకాంబరం సాగుకు అనుకూలం. మొక్క పెరుగుదలకు 30 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉండాలి. చల్లని వాతావరణ పరిస్థితుల్లో పూల దిగుబడి అధికంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా ఉంటే పూలు లేత రంగుకు మారి నాణ్యత తగ్గుతుంది. మరీ తక్కువ ఉష్ణోగ్రతను కూడా మొక్క తట్టుకోలేదు. నీరు నిలవని అన్ని రకాల నేలలు, ఉదజని సూచిక 6 నుంచి 7.5 మధ్య ఉన్న నేలల్లో మంచి దిగుబడి వస్తుంది.


