News January 12, 2025
కొత్త కెప్టెన్‌ను వెతకండి: BCCIతో రోహిత్ శర్మ!
టీమ్ఇండియాకు కొత్త కెప్టెన్‌ను వెతకాలని BCCIకి రోహిత్ శర్మ సూచించినట్టు తెలిసింది. CT25 సహా మరికొన్ని నెలలు తననే కొనసాగించాలని కోరినట్టు సమాచారం. జట్టు ప్రదర్శనపై శనివారం బోర్డు సమీక్షలో హిట్‌మ్యాన్, కోచ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అగార్కర్ తమ అభిప్రాయాలు చెప్పారు. బుమ్రాకు నాయకత్వం అప్పగించేందుకు కొందరు విముఖత చూపారని తెలిసింది. దీంతో ఇంగ్లాండుతో 5 టెస్టుల సిరీసుకు నాయకత్వంపై సందిగ్ధం నెలకొంది.
Similar News
News January 12, 2025
మళ్లీ విద్యార్థి రాజకీయాలు రావాలి: సీఎం
TG: విద్యార్థి దశలో సిద్ధాంతపరమైన భావజాలం తగ్గిపోవడం వల్లే పార్టీ ఫిరాయింపులు పెరిగాయని సీఎం రేవంత్ అన్నారు. రాష్ట్రంలో మళ్లీ విద్యార్థి రాజకీయాలు రావాలని అభిప్రాయపడ్డారు. తమిళనాడులో అన్ని పార్టీలు ఏకమై రాష్ట్రం కోసం పని చేస్తాయని, తెలంగాణలోనూ ఆ సంప్రదాయం రావాలని తెలిపారు. మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మకథ ‘ఉనిక’ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు.
News January 12, 2025
సీనియర్ ప్లేయర్లపై బీసీసీఐ కీలక నిర్ణయం?
టీమ్ ఇండియా సీనియర్ ప్లేయర్లు అందరూ దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకవేళ పని ఒత్తిడి వల్ల వారికి ఆడడం కుదరకపోతే ముందుగానే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ అనుమతి తీసుకోవాలని సమాచారం. దీనిని అతిక్రమించినవారిపై బీసీసీఐ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఫిట్‌నెస్ ఉన్న ఆటగాళ్లనే జట్టు ఎంపికకు పరిగణనలోకి తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
News January 12, 2025
ఎన్నికలంటేనే భయం వేస్తోంది.. పోటీ చేయలేం: మాజీ సీఎం కిరణ్
AP: ఏ పార్టీలో ఉన్నప్పటికీ వ్యక్తిగా తాను మారలేదని మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. డబ్బు దోచుకునే వాళ్లలో కొందరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, ప్రజలు వారికే ఓట్లు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో జరిగిన ‘సంక్రాంతి ఆత్మీయ కలయిక’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలంటేనే భయమేస్తోందని, రానున్న రోజుల్లో పోటీ చేసే పరిస్థితి లేదని అభిప్రాయపడ్డారు.