News May 3, 2024
రోహిత్ శర్మ చెత్త రికార్డు

ఐపీఎల్లో MI బ్యాటర్ రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. అత్యధికసార్లు(8) ఒకే బౌలర్(సునీల్ నరైన్)కు వికెట్ సమర్పించుకున్న ప్లేయర్గా నిలిచారు. ఏడుసార్ల చొప్పున ధోనీ(vsజహీర్ ఖాన్), కోహ్లీ(vsసందీప్ శర్మ), అంబటి రాయుడు(vsమోహిత్), రోహిత్(vsఅమిత్ మిశ్రా), ఉతప్ప(vsఅశ్విన్), పంత్(vsబుమ్రా), రహానే(vsభువనేశ్వర్) ఔటయ్యారు.
Similar News
News November 26, 2025
‘అదునెరిగి సేద్యం, పదునెరిగి పైరు’

సమయం చూసి వ్యవసాయం చేయాలి. అంటే, వాతావరణ పరిస్థితులు, భూమి స్వభావం, నీటి లభ్యత వంటి అంశాలను పరిశీలించి సాగును ప్రారంభించాలి. భూమికి, వాతావరణానికి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే పంటను వెయ్యాలి. సమయం దాటితే పంట చేతికి రాదు, శ్రమ కూడా వృథా అవుతుంది. అలాగే ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే సమయాన్ని సరిగ్గా అంచనా వేసి, సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చెప్పడం ఈ సామెత ఉద్దేశం.

సర్పంచులకు జీతం ఎంతంటే?

TG: పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో సర్పంచుల జీతంపై చర్చ జరుగుతోంది. 2021కి ముందు సర్పంచులకు నెలకు రూ.5వేల గౌరవ వేతనం ఉండేది. ఆ తర్వాత నుంచి రూ.6,500 చెల్లిస్తున్నారు. ఎంపీటీసీలకు రూ.6,500, జడ్పీటీసీ, ఎంపీపీలకు రూ.13,000, జడ్పీ ఛైర్మన్లకు రూ.లక్ష వరకు జీతం ఇస్తున్నారు. కాగా సర్పంచ్ ఎన్నికలు డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో జరగనున్నాయి.