News October 19, 2024

అంపైర్లతో రోహిత్ శర్మ వాగ్వాదం

image

బ్యాడ్ లైట్ కారణంగా భారత్-న్యూజిలాండ్ <<14399404>>మ్యాచ్‌ను <<>>అంపైర్లు నిలిపివేశారు. బుమ్రా 4 బంతులు వేసిన అనంతరం స్టేడియం చుట్టూ నల్లమబ్బులు కమ్మేయడంతో ఇవాళ్టి ఆటను ఆపేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ, ఇతర భారత ప్లేయర్లు అంపైర్లతో వాగ్వాదానికి దిగారు. వర్షం పడకున్నా మ్యాచ్ నిలిపివేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ కాసేపటికే స్టేడియంలో కుండపోత వర్షం ప్రారంభమైంది.

Similar News

News November 27, 2025

నాగర్‌కర్నూల్: నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత: ఎస్పీ

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో మొదటి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్లు గురువారం ప్రారంభమయ్యాయి. మొత్తం 151 గ్రామాలకు గాను ఏర్పాటు చేసిన 48 నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ తెలిపారు.

News November 27, 2025

శివజ్యోతి ఆధార్ కార్డును టీటీడీ బ్లాక్ చేసిందా?.. క్లారిటీ ఇదే!

image

AP: ప్రముఖ యాంకర్ శివజ్యోతికి TTD షాక్ ఇచ్చిందన్న వార్త తెగ వైరల్ అవుతోంది. ఆమె భవిష్యత్‌లో శ్రీవారిని దర్శించుకోకుండా ఆధార్ కార్డును బ్లాక్ చేసిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో వాస్తవం లేదు. TTD దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. శ్రీవారి ప్రసాదం తీసుకుంటూ ‘కాస్ట్లీ బిచ్చగాళ్లం’ అంటూ <<18363529>>వీడియో<<>> చేయడంతో ఈ దుమారం రేగింది. ఆమె ఆధార్ బ్లాక్ చేయాలని పలువురు కోరారు. కానీ TTD ఆ నిర్ణయం తీసుకోలేదు.

News November 27, 2025

గంభీర్‌ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు: గవాస్కర్

image

టీమ్ ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్‌కు క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మద్దతుగా నిలిచారు. ప్లేయర్లను సిద్ధం చేయడమే కోచ్ పని అని, గ్రౌండ్‌లోకి దిగి ఆడాల్సింది ప్లేయర్లేనని స్పష్టం చేశారు. ‘ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ విజయాలకు క్రెడిట్ ఇవ్వనప్పుడు, ఇప్పుడు మాత్రం ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? జవాబుదారీతనం ఎందుకు అడుగుతున్నారు? జీవితాంతం కోచ్‌గా ఉండాలని అతడు ట్రోఫీలు గెలిచినప్పుడు అడిగారా?’ అని నిలదీశారు.