News November 10, 2024
ఫించ్ కామెంట్‌పై స్పందించిన రోహిత్ శర్మ భార్య

ఆస్ట్రేలియాలో జరిగే BGT సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానున్నారు. ఆయన గైర్హాజరు కావడాన్ని గవాస్కర్ విమర్శించగా, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ రోహిత్‌కు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. బిడ్డ పుట్టే సందర్భాన్ని ఆస్వాదించడం రోహిత్ హక్కని ఫించ్ వ్యాఖ్యానించారు. ఆ కామెంట్స్‌పై ఇన్‌స్టాలో రోహిత్ భార్య రితిక స్పందించారు. ఫించ్‌ను ట్యాగ్ చేస్తూ సెల్యూట్ ఎమోజీ జత చేశారు.
Similar News
News November 30, 2025
ఈ జిల్లాల ప్రజలు బయటకు రాకండి!

AP: దిత్వా తుఫాను భారత్ వైపు దూసుకొస్తోంది. దీని ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని APSDMA పేర్కొంది. ‘కోస్తాతీరం వెంబడి గంటకు 45-65 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముంది. NLR, TPT జిల్లాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతేనే బయటికి వెళ్లండి. అత్యవసర సహాయం కోసం నెల్లూరు, కడప, వెంకటగిరిలో NDRF బృందాలు సిద్ధంగా ఉన్నాయి’ అని తెలిపింది.
News November 30, 2025
HER2-పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి తెలుసా?

బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చాలామందికి తెలుసుగానీ HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్ గురించి చాలామంది మహిళలకి తెలియదు. ఇది సాధారణ రొమ్ము కేన్సర్ కంటే ప్రమాదకరమైనది. శరీరంలోని ఇతర భాగాలకు సులభంగా వ్యాపిస్తుంది. HER2-పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ కణ పెరుగుదల, విభజనను ప్రోత్సహించే గ్రాహకమైన HER2 (హ్యూమన్ ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టర్ 2) ప్రోటీన్ అధికంగా ఉత్పత్తి అవ్వడంతో వస్తుందంటున్నారు నిపుణులు.
News November 30, 2025
HER2-పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్స

HER2-పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్‌కు టార్గెటెడ్ థెరపీ, కీమోథెరపీ, శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ, హార్మోన్ల చికిత్సను వైద్యులు చేస్తారు. అయితే ఇది తగ్గడం అనేది రోగి ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. దీనిపై అవగాహన పెంచుకోవడం, ముందుగానే స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం వల్ల దీని చికిత్స సులువవుతుందంటున్నారు నిపుణులు. కాబట్టి అసాధారణ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.


