News December 30, 2024

కెరీర్‌లోనే రోహిత్ శర్మ చెత్త రికార్డు

image

టెస్టుల్లో వరుసగా విఫలమవుతున్న టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఈ ఏడాది 619 రన్స్ చేసిన అతను 24.76 యావరేజ్‌ నమోదుచేశారు. 11 ఏళ్ల టెస్టు కెరీర్‌లో ఇదే అత్యల్ప యావరేజ్. 2013లో 66.60, 2014లో 26.33, 2015లో 25.07, 2016లో 57.60, 2017లో 217, 2018లో 26.28, 2019లో 92.66, 2021లో 47.68, 2022లో 30, 2023లో 41.92 యావరేజ్‌తో రన్స్ చేశారు.

Similar News

News January 2, 2025

సామాన్యుడి జీవితం అత‌లాకుతలం: ఖ‌ర్గే

image

NDA ప్ర‌భుత్వం దేశంలో సృష్టించిన ఆర్థిక సంక్షోభంతో సామాన్యుడి జీవితం అత‌లాకుత‌ల‌మైంద‌ని కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఖ‌ర్గే మండిప‌డ్డారు. ప‌రోక్ష ప‌న్నుల‌తో సామాన్యుల సేవింగ్స్ తగ్గిపోతున్నాయన్నారు. బంగారం రుణాల్లో 50% పెరుగుదల, బంగారు రుణ NPAలలో 30% వృద్ధి, ప్ర‌జ‌ల వ‌స్తు-సేవ‌ల కొనుగోలు శ‌క్తి మందగించడం, కార్ల కొనుగోళ్లు ప‌డిపోవ‌డం, కీలక రంగాల్లో సరైన వేతన పెంపు లేకపోవడం ఇందుకు నిదర్శనమని వివరించారు.

News January 2, 2025

CMR కాలేజీ హాస్టల్ వార్డెన్ అరెస్ట్

image

TG: CMR <<15046521>>కాలేజీ హాస్టల్<<>> వార్డెన్ ప్రీతిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హాస్టల్‌లో జరుగుతున్న ఘటనలకు ఆమెనే కారణమని ఆరోపణలు రావడంతో అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు. మరోవైపు బాత్ రూం పక్కనే వంట సిబ్బంది రూం ఉందని, వాళ్లే వీడియోలు తీసి ఉంటారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సీఎంఆర్ కాలేజీ ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేసింది. ప్రీతిరెడ్డిని కాలేజీ నుంచి సస్పెండ్ చేసింది.

News January 2, 2025

తరం మారింది! న్యూఇయర్ వేడుకల తీరూ మారింది!

image

న్యూఇయర్ వేడుకల తీరులో క్రమంగా మార్పు వస్తోందని విశ్లేషకులు అంటున్నారు. యూత్ తాగి తూగడమే కాదు దైవ సన్నిధిలో గడిపేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొంటున్నారు. కాశీ, అయోధ్య, పూరీ, మథుర, తిరుమల, శ్రీశైలం, ఉజ్జయిని, బృందావనం వంటి పుణ్యక్షేత్రాలను DEC 31, JAN 1న లక్షల్లో సందర్శించడాన్ని ఉదహరిస్తున్నారు. AP, TG లోనూ ఆలయాలు కిటకిటలాడటం తెలిసిందే. ఇంగ్లిష్ ఇయర్‌ను ఇండియనైజ్ చేస్తున్నారని కొందరి మాట!