News March 13, 2025

రోహిత్ తనకంటే జట్టు గురించే ఎక్కువ ఆలోచిస్తారు: సెహ్వాగ్

image

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిస్వార్థంగా ఆలోచిస్తారంటూ భారత మాజీ క్రికెటర్ సెహ్వాగ్ ప్రశంసించారు. ‘రోహిత్ కెప్టెన్సీని మనం తక్కువ అంచనా వేస్తుంటాం. పలు ఐసీసీ టైటిల్స్ గెలిచిన కెప్టెన్‌గా ఆయన ధోనీ సరసన ఉన్నారు. ఆటగాళ్లతో చక్కటి సమన్వయం, ముందుండి నడిపించడంలో రోహిత్ శైలి అద్భుతం. ఏ ఆటగాడైనా అభద్రతతో ఉంటే అతడిలో విశ్వాసాన్ని నింపుతుంటారు. మొత్తంగా ఆయన తిరుగులేని నాయకుడు’ అని కొనియాడారు.

Similar News

News March 29, 2026

MEGA158.. ఊర మాస్ లుక్‌లో చిరు?

image

‘వాల్తేరు వీరయ్య’ తర్వాత బాబీ-చిరంజీవి కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమా(MEGA158) షూటింగ్ APR 20న ప్రారంభం కానున్నట్లు సమాచారం. యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా మూవీ ఉంటుందని, ఊర మాస్ లుక్‌లో మెగాస్టార్ కనిపిస్తారని టాలీవుడ్ టాక్. భారీ బడ్జెట్‌తో రూపొందే ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియమణి, చిరు కూతురుగా అనశ్వరా రాజన్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉంది.

News March 29, 2026

అత్యాచార బాధితుల పేర్లను తీర్పుల్లోనూ వాడరాదు: సుప్రీంకోర్టు

image

అత్యాచార బాధితులు, వారి కుటుంబీకుల పేర్లను తీర్పుల్లోనూ ప్రస్తావించరాదని అన్ని హైకోర్టులకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వారిని గుర్తించే అవకాశమున్న ఏ వివరాలనూ ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో చెప్పరాదని 2018లోనే అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిందంది. లైంగిక నేరాల బాధితులకు సమాజంలో ఇబ్బందులు కలగకుండా ఇలా చేసినట్లు పేర్కొంది. ఓ బాలిక వివరాలను HP హైకోర్టు ప్రస్తావించడాన్ని తప్పుపట్టింది.

News March 29, 2026

ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ గురించి తెలుసా?

image

ప్రెగ్నెన్సీలో మహిళలు మద్యం తాగడం వల్ల బిడ్డకు ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ ఏర్పడే ప్రమాదం పెరుగుతుందంటున్నారు నిపుణులు. దీంతో శిశువుకు శారీరక, మానసిక లోపాలు ఏర్పడతాయంటున్నారు. ప్రెగ్నెన్సీలో ఆల్కహాల్ తీసుకుంటే అది పిండంలోకి సులువుగా చేరుతుంది. కాలేయం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందకపోవడం వల్ల ఆల్కహాల్ శిశువు శరీరంలో పేరుకుపోతుంది. దీంతో శిశువుకు పోషకాలు, ఆక్సిజన్ అందక అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది.