News April 13, 2024
వచ్చే సీజన్‌లో CSK కెప్టెన్‌గా రోహిత్: వాన్

వచ్చే ఐపీఎల్ సీజన్‌లో రోహిత్ శర్మ చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించవచ్చని ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకేల్ వాన్ అభిప్రాయపడ్డారు. ఈ ఒక్క ఏడాదే రుతురాజ్ కెప్టెన్‌గా ఉంటారని.. వచ్చే ఏడాది రోహిత్ ఆ స్థానాన్ని భర్తీ చేస్తారని అనుకుంటున్నానని చెప్పారు. సీఎస్కేకు కాకుండా రోహిత్ హైదరాబాద్‌కు ఆడినా బాగుంటుందన్నారు. కాగా వచ్చే సీజన్‌లో రోహిత్ ముంబైని వీడనున్నట్లు సమాచారం.
Similar News
News April 3, 2026
రష్యా నుంచి 90% పెరిగిన ఆయిల్ దిగుమతులు

హార్ముజ్ సంక్షోభం నేపథ్యంలో రష్యా నుంచి ఇండియా ఆయిల్ దిగుమతులు భారీగా పెరిగాయి. ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో 90% అధికంగా చమురు వచ్చింది. అయినప్పటికీ దేశంలో మొత్తం ఇంపోర్ట్స్‌లో 15% తగ్గుదల నమోదైంది. గత నెలలో LPG దిగుమతులు 40% పడిపోగా, LNG రవాణా తగ్గిపోయింది. దీంతో ప్రత్యామ్నాయ వనరులపై భారత్ దృష్టిపెట్టింది. రష్యాతోపాటు అంగోలా, గాబన్, ఘనా, కాంగో తదితర దేశాల నుంచి క్రూడ్‌ను కొనుగోలు చేస్తోంది.
News April 3, 2026
RGSSHలో 44 ఉద్యోగాలు.. ఇంటర్వ్యూతో ఎంపిక

రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్(RGSSH), న్యూఢిల్లీ.. కాంట్రాక్ట్ పద్ధతిలో 44 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిలో ప్రొఫెసర్-07, అసోసియేట్ ప్రొఫెసర్-09, అసిస్టెంట్ ప్రొఫెసర్-28 ఉద్యోగాలు ఉన్నాయి. పోస్టును బట్టి MS/MD, MCh/DM అర్హత ఉండాలి. ఇంటర్వ్యూతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 10.04.26. మరిన్ని వివరాల కోసం rgssh.delhi.gov.in చూడండి.
News April 3, 2026
సంజీవ్ గోయెంకా జోకర్: లలిత్ మోదీ

LSG ఓనర్ <<19547295>>సంజీవ్ గోయెంకా<<>>పై IPL మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మ్యాచ్ ఓడిపోతే అతను తన టీమ్ కెప్టెన్, కోచింగ్ స్టాఫ్‌తో వ్యవహరించే తీరును ఎండగట్టారు. ఆయన ఓ లూజర్, జోకర్ అంటూ మండిపడ్డారు. ప్లేయర్లు, అభిమానుల కోసం లీగ్‌ను సృష్టించానన్నారు. తానింకా IPL ఛైర్మన్‌గా ఉంటే ఆయన్ను బ్యాన్ చేయడంతో పాటు జట్టుపై అతని యాజమాన్యాన్ని శాశ్వతంగా రద్దు చేసేవాడిని అని ట్వీట్ చేశారు.


