News January 28, 2025

గవాస్కర్‌పై బీసీసీఐకి రోహిత్ ఫిర్యాదు?

image

మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌పై టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ‘గవాస్కర్ చేసిన విమర్శలు తనపై ఒత్తిడి పెంచాయని రోహిత్ బోర్డు పెద్దల వద్ద అన్నారు. ఆ స్థాయిలో తనపై విరుచుకుపడాల్సిన అవసరంలేదని రోహిత్ భావించారు’ అని క్రిక్‌బ్లాగర్ పేర్కొంది. రోహిత్ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని గవాస్కర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Similar News

News December 3, 2025

నామినేషన్ స్వీకరణ ప్రక్రియను సజావుగా చేపట్టాలి: అ.కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియను అధికారులు సజావుగా చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా.శ్రీజ అన్నారు. బుధవారం తల్లాడ మండలంలో పర్యటించిన అదనపు కలెక్టర్.. రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నామినేషన్ వేసే అభ్యర్థులు సమన్వయంతో అధికారులకు సహకరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు.

News December 3, 2025

PM మోదీకి CM రేవంత్ అందించిన వినతులివే

image

⋆HYD​ మెట్రో రెండో దశ విస్తరణను కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్​ వెంచర్​గా చేపట్టేందుకు ఆమోదించాలి
⋆RRR ఉత్తర, దక్షిణ భాగం​ నిర్మాణానికి, మన్ననూర్​-శ్రీశైలం 4 వరుసల ఎలివేటేడ్​ కారిడార్‌కు అనుమతులివ్వాలి. RRR వెంట రీజనల్​ రింగ్​ రైలు ప్రాజెక్టును చేపట్టాలి
⋆HYD-అమరావతి-మచిలీపట్నం​ పోర్ట్ 12 లేన్ల​ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్​ప్రెస్​ హైవే, HYD-BLR గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్​ప్రెస్​ వే నిర్మాణానికి చొరవ చూపాలి

News December 3, 2025

ఏఐతో అశ్లీల ఫొటోలు.. X వేదికగా రష్మిక ఫిర్యాదు

image

అసభ్యకరంగా మార్ఫింగ్ చేసిన తన ఫొటోలు వైరల్ కావడంతో హీరోయిన్ రష్మిక Xలో ఘాటుగా స్పందించారు. ‘AIని అభివృద్ధి కోసం కాకుండా కొందరు అశ్లీలతను సృష్టించడానికి, మహిళలను లక్ష్యంగా చేసేందుకు దుర్వినియోగం చేస్తున్నారు. AIని మంచి కోసం మాత్రమే వాడుకుందాం. ఇలాంటి దుర్వినియోగానికి పాల్పడేవారికి కఠిన శిక్ష విధించాలి’ అని కోరుతూ ‘Cyberdost’కు ట్యాగ్ చేసి ఫిర్యాదు చేశారు.