News December 25, 2024
రేపటి టెస్టులో రోహిత్ ఓపెనింగ్!

రేపటి నుంచి ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. యశస్వీతో కలిసి హిట్‌మ్యాన్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారని, కేఎల్ రాహుల్ మూడో స్థానంలో వస్తారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు భారత్ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో సుందర్ వస్తారని తెలుస్తోంది.
Similar News
News December 20, 2025
ఎద్దు అడుగులో ఏడు గింజలు పడితే పంట పలచన

నాగలితో దున్నుతూ విత్తనాలు వేసేటప్పుడు, ఎద్దు వేసే ఒక అడుగు దూరంలో ఏడు గింజలు పడ్డాయంటే అవి చాలా దగ్గర దగ్గరగా పడ్డాయని అర్థం. ఇలా విత్తనాలు మరీ దగ్గరగా మొలిస్తే మొక్కలకు గాలి, వెలుతురు సరిగా అందవు. నేలలోని పోషకాల కోసం మొక్కల మధ్య పోటీ పెరిగి ఏ మొక్కా బలంగా పెరగదు. ఫలితంగా పంట దిగుబడి తగ్గి పలచగా కనిపిస్తుంది. అందుకే పంట ఆశించిన రీతిలో పండాలంటే విత్తనాల మధ్య తగినంత దూరం ఉండాలని ఈ సామెత చెబుతుంది.
News December 20, 2025
శనివారం రోజున ఇంట్లో సాంబ్రాణి వెలిగిస్తే..?

శనివారం రోజున ఇంట్లో సాంబ్రాణి వెలిగించడం వల్ల వెలువడే సుగంధభరితమైన పొగ మానసిక ప్రశాంతతను ఇచ్చి, మనలోని సోమరితనాన్ని, ప్రతికూల ఆలోచనలను పారద్రోలుతుందని పండితులు చెబుతున్నారు. ‘ఆధ్యాత్మికంగా చూస్తే.. ఈ ధూపం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు నశించి ఈతిబాధలు తొలగిపోతాయి. అలాగే సకల దేవతల అనుగ్రహం లభించి, కుటుంబంలో సుఖశాంతులు చేకూరుతాయి. మనసు ఉల్లాసంగా మారి పనుల పట్ల ఉత్సాహం పెరుగుతుంది’ అంటున్నారు.
News December 20, 2025
సిరియా ISIS స్థావరాలపై US వైమానిక దాడులు

సిరియాలోని ఇస్లామిక్ స్టేట్(ISIS) ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా US వైమానిక దళాలు దాడులకు దిగాయి. ఇటీవల సిరియాలో ముగ్గురు అమెరికన్లను చంపిన నేపథ్యంలో ప్రతీకారంగా ఆపరేషన్ హకియి స్ట్రైక్ పేరుతో ఎటాక్ చేసినట్టు US డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సేత్ తెలిపారు. అమెరికన్లను లక్ష్యంగా చేసుకుంటే ప్రపంచంలో ఎక్కడున్నా వేటాడి చంపుతామన్నారు. ట్రంప్ లీడర్‌షిప్‌లో అమెరికన్లను కాపాడుకోవడానికి వెనకాడబోమని చెప్పారు.


