News October 7, 2024

రోహిత్ 2027 ప్రపంచకప్ ఆడతాడు: చిన్ననాటి కోచ్

image

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కచ్చితంగా 2027 వన్డే ప్రపంచకప్ ఆడతాడని అతడి చిన్ననాటి కోచ్ దినేశ్ లాడ్ అన్నారు. WTC ఫైనల్ తర్వాత టెస్టుల నుంచి తప్పుకుని వన్డేల్లో కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం రోహిత్ అద్భుతంగా ఆడుతున్నాడని, ఫిట్‌నెస్ సమస్యలు కూడా లేవని తెలిపారు. 2023 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓటమికి రోహిత్ ఔటవడమే ప్రధాన కారణమని లాడ్ అభిప్రాయపడ్డారు.

Similar News

News October 18, 2025

నేడు ఇలా చేస్తే సకల శుభాలు

image

నేడు ధన త్రయోదశి పర్వదినం. ఈరోజున ధన్వంతరి, లక్ష్మీదేవి, కుబేరుడు, వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించాలని పండితులు చెబుతున్నారు. ‘ఈ శుభ దినాన బంగారం, వెండి, లోహ పాత్రలు, కొత్తిమీర, కొత్త చీపురు కొనడం శుభప్రదం. ప్రధాన ద్వారం వద్ద యముడికి దీపాన్ని దానం చేయడం ద్వారా అకాల మృత్యు భయం తొలగుతుంది. తెల్లని వస్తువులు దానం చేస్తే లక్ష్మీ, కుబేరుల అనుగ్రహం లభించి, సంపద వర్షిస్తుంది’ అని పేర్కొంటున్నారు.

News October 18, 2025

నేడు ఉద్యోగ సంఘాలతో చర్చలు

image

AP: నేడు సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో కీలక చర్చలు జరగనున్నాయి. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో మంత్రుల బృందం వారితో సమావేశంకానుంది. పీఆర్సీ అమలు, డీఏ బకాయిలు, జీపీఎఫ్, పీఎఫ్ సమస్యలు, పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంబంధిత సమస్యలపై చర్చించనున్నారు. మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, సీఎస్ విజయానంద్ ఈ భేటీలో పాల్గొంటారు.

News October 18, 2025

భారత్‌కు ఆర్థిక నేరగాడు మెహుల్ ఛోక్సీ!

image

ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీని భారత్‌కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత్ అభ్యర్థన మేరకు అతడిని అరెస్టు చేయడం సరైందేనని అట్వర్ప్‌లోని న్యాయస్థానం పేర్కొంది. అయితే అతడికి హైకోర్టుకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉన్నా అతడిని ఇండియాకి తీసుకురావడంలో ఇది కీలక అడుగుగా చెప్పొచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.13 వేల కోట్లు ఎగవేసి ఛోక్సీ విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే.