News November 3, 2024
రోహిత్, విరాట్.. మీకేమైంది?

టెస్టుల్లో భారత సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశ పరుస్తున్నారు. గత 10 ఇన్నింగ్సుల్లో కోహ్లీ 192 రన్స్ చేయగా, రోహిత్ 133 పరుగులు చేశారు. ఇవాళ కీలకమైన టెస్టులోనూ ఈ ఇద్దరూ తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. సొంతగడ్డపై ఇంత దారుణంగా ఆడటమేంటని భారత ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కనీసం డిఫెన్స్ చేసుకోలేకపోతున్నారని, ఆస్ట్రేలియాపై ఎలా రాణిస్తారని ప్రశ్నిస్తున్నారు.
Similar News
News January 7, 2026
PDPL: విద్యాశాఖలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

విద్యాశాఖలో చేపట్టిన నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ZPHS, KGBV, పీఎంశ్రీ పాఠశాలలు, కళాశాలల పనుల పురోగతిని సమీక్షించారు. శాతవాహన వర్సిటీ అడ్మిన్ బ్లాక్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పనుల్లో నాణ్యత పాటించాలని, నిధుల వినియోగంలో జాప్యం ఉండకూడదని, సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

8న అరసవల్లిలో కర్టెన్ రైజర్

అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో జనవరి 19 నుంచి 25వ తేదీ వరకు రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులుతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈనెల 9న ఉదయం 8గంటలకు కర్టెన్ రైజర్తో వేడుకలకు అంకురార్పణ చేస్తామన్నారు.