News May 13, 2024
రోహిత్ 50ఏళ్ల వరకూ ఆడతారు: యోగ్‌రాజ్

భారత కెప్టెన్ రోహిత్‌శర్మ ఫిట్‌నెస్, ట్రైనింగ్ గురించి ఎప్పుడూ ఆలోచించని గొప్ప క్రికెటర్ అని యువరాజ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ అన్నారు. ఒకవేళ ఫిట్‌నెస్ గురించి ఆలోచిస్తే రోహిత్ 50ఏళ్ల వరకూ క్రికెట్ ఆడతారని అభిప్రాయపడ్డారు. ఆటలో వయస్సు గురించి మాట్లాడటంలో అర్థం లేదని, 40-45 సంవత్సరాల్లో ఫిట్‌గా ఉండి బాగా ఆడితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. క్రికెట్లో వయస్సు అంశాన్ని రద్దు చేయాలని ఆయన అన్నారు.
Similar News
News March 19, 2026
PNG.. జిల్లాల వారీగా ఈ కంపెనీల సర్వీసులు

ఏపీలోని అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో THINK GAS అనే కంపెనీ PNG సర్వీసును అందిస్తోంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో IOCL, ఉభయగోదావరిలో గోదావరి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్, విజయవాడ, కాకినాడలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్(BGL), కృష్ణాలో మెగా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు సేవలు అందిస్తున్నాయి. HYDలో BGL, పలు జిల్లాల్లో IOCL సర్వీసులు ఉన్నాయి.
News March 19, 2026
‘గాంధారి వాన’ అంటే ఏమిటి?

అవసరం లేనప్పుడు కురిసే వర్షాన్ని ‘గాంధారి వాన’ అంటారు. ప్రస్తుతం పడుతోంది ఇలాంటి వర్షమే. ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి కావడంతో భార్య గాంధారి తానూ కళ్లకు గంతలు కట్టుకొని 100 మంది కొడుకుల అకృత్యాలను చూడకుండా అమితమైన ప్రేమను కురిపించారు. దీంతో బిడ్డలంతా మరణిస్తారు. ఇలాగే అదును కాని వర్షంతో పంటలు నాశనమవుతాయి. ‘గాంధారి వాన’ ప్రస్తావన నాని నటించిన ఓ సినిమా పాటలో ఉంది. తెలిస్తే కామెంట్ చేయండి.
<<-se>>#EPICSAYINGS<<>>
News March 19, 2026
IPL: సన్‌రైజర్స్ ప్లేయింగ్-11 ఇదేనా?

IPL-2026: SRH మార్చి 28న ఆర్సీబీతో తొలి మ్యాచ్ ఆడనుంది. క్రికెట్ విశ్లేషకుల అంచనా ప్రకారం తుది జట్టు..
SRH: హెడ్, అభిషేక్, ఇషాన్ (C), క్లాసెన్ (WK), లివింగ్‌స్టన్, నితీశ్ రెడ్డి, అనికేత్ వర్మ, బ్రైడన్ కార్స్, హర్షల్, ఉనద్కత్, జీషన్ అన్సారీ.
> స్మరణ్, అరోరా, కమిందు మెండిస్, హర్ష్ దూబే, శివంగ్, ఫులేట్రా, ఎడ్వర్డ్స్, ఎషాన్ మలింగ, షకీబ్ హుస్సేన్, ఓంకార్, అమిత్, ప్రఫుల్, మావి అనే ప్లేయర్లూ ఉన్నారు.


