News December 31, 2024

కెప్టెన్ కాకపోయి ఉంటే రోహిత్‌ను ఇప్పటికే తప్పించేవారు: పఠాన్

image

అత్యంత పేలవంగా ఆడుతున్నప్పటికీ కేవలం కెప్టెన్ కాబట్టే రోహిత్ శర్మ ఇంకా జట్టులో కొనసాగుతున్నారని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డారు. ‘రోహిత్ రన్స్ చేయలేక ఇబ్బంది పడుతున్నారు. ఫామ్ చాలా ఘోరంగా ఉంది. ఆయన జట్టులో లేకపోయి ఉంటే ఓపెనర్‌గా రాహుల్, యశస్వి, మూడో స్థానంలో గిల్ వచ్చి ఉండేవారు. మనం నిజాలు మాట్లాడుకోవాలి. ఫామ్ బట్టి చూస్తే రోహిత్‌కు అసలు తుది జట్టులో చోటే దక్కదు’ అని తేల్చిచెప్పారు.

Similar News

News January 3, 2025

తెలుగు రాష్ట్రాలకు బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జులు వీరే

image

తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జుల్ని నియమించింది. తెలంగాణకు వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే, ఆంధ్రప్రదేశ్‌కు కర్ణాటక బీజేపీ నేత పీసీ మోహన్‌ పేర్లను ప్రకటించింది. ఇక తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డిని తమిళనాడుకు రిటర్నింగ్ అధికారిగా నియమించింది. బీజేపీ నిబంధనల ప్రకారం పార్టీ జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.

News January 3, 2025

BGT: నేటి టెస్టు టైమింగ్స్ ఇవే

image

నేడు సిడ్నీలో బోర్డర్ గవాస్కర్‌ సిరీస్‌లో ఆఖరి టెస్టు ప్రారంభం కానుంది. ఐదు టెస్టుల టోర్నీలో 2-1తో ఆస్ట్రేలియా ముందంజలో ఉంది. దీంతో సిరీస్‌ను నిలబెట్టుకోవాలంటే భారత్ చివరి టెస్టు కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. ఉదయం 4.30 గంటలకు టాస్ వేస్తారు. ఉదయం 5 నుంచి 7 గంటల వరకు తొలి సెషన్, 7.40 నుంచి 9.40 వరకు రెండో సెషన్, 10 నుంచి 12 గంటల వరకు ఆఖరి సెషన్ ఉంటుంది.

News January 3, 2025

అమృత్‌పాల్ సింగ్ కొత్త పార్టీ?

image

ఖలిస్థానీ వేర్పాటువాది, ఎంపీ అమృత్‌పాల్ సింగ్ కొత్త పార్టీ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 14న పంజాబ్‌లోని శ్రీ ముక్త్ సర్ సాహిబ్ జిల్లాలో జరిగే ఓ కార్యక్రమంలో పార్టీ పేరును అధికారికంగా ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. కాగా అజ్‌నాలా పీఎస్‌పై దాడి కేసులో అరెస్టైన అమృత్ పాల్ సింగ్ దిబ్రూగఢ్ జైలులో ఉన్నారు. గత ఎన్నికల్లో జైలు నుంచే ఆయన పోటీ చేసి ఖడూర్ సాహిబ్ ఎంపీగా గెలుపొందిన విషయం తెలిసిందే.