News April 21, 2025
TGలో ‘రోహిత్ వేముల చట్టం’ తేవాలి.. CMకు రాహుల్ గాంధీ లేఖ

తెలంగాణలో ‘రోహిత్ వేముల చట్టం’ తేవాలని CM రేవంత్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. దళిత విద్యార్థులు కుల వివక్షను ఎదుర్కోకుండా, వారి హక్కుల పరిరక్షణ కోసం ఈ చట్టాన్ని రూపొందించాలని కోరారు. ఇటీవల దీనిపై కర్ణాటక CM సిద్ధరామయ్యకూ రాహుల్ లెటర్ రాశారు. కాగా HCU విద్యార్థి రోహిత్ వేముల 2016లో సూసైడ్ చేసుకోగా, కుల వివక్ష వేధింపులే కారణమని దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.
Similar News
News August 7, 2025
వచ్చే వారంలో ట్రంప్, పుతిన్ భేటీ!

US ప్రెసిడెంట్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చే వారం భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ట్రంప్ తొలుత పుతిన్‌తో వ్యక్తిగతంగా సమావేశమవుతారని, ఆ తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడితో కలిసి రష్యాతో సీజ్ ఫైర్‌పై చర్చిస్తారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ‘రష్యన్లు ట్రంప్‌ను కలవాలనుకుంటున్నారు. రష్యా, ఉక్రెయిన్ దేశాధినేతలతో మాట్లాడి యుద్ధాన్ని ముగించాలని ట్రంప్ కోరుకుంటున్నారు’ అని వైట్‌హౌస్ ఓ ప్రకటనలో పేర్కొంది.
News August 7, 2025
AP న్యూస్ రౌండప్

☞ విశాఖలో రూ.35Crతో 5 ఎకరాల్లో థీమ్ పార్క్ ఏర్పాటు: మంత్రి దుర్గేశ్
☞ CM స్థానంలో ఉన్న చంద్రబాబు ఒక్క <<17326231>>జడ్పీటీసీ<<>> స్థానం కోసం ఇంతగా దిగజారిపోతారా: YS జగన్
☞ స్కూళ్లలో ఈ నెల 11 నుంచి ఫార్మెటివ్-1 పరీక్షలు
☞ సర్పంచ్, MPTC ఉప ఎన్నికలు పూర్తయిన ప్రాంతాల్లో ఎలక్షన్ కోడ్ ఎత్తివేత
☞ ఈ నెల 24న గ్రామ సర్వేయర్లకు శాఖాపరమైన పరీక్షలు
News August 7, 2025
DOST: స్పెషల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి

డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST) స్పెషల్ ఫేజ్ వెబ్ కౌన్సెలింగ్ పూర్తయింది. 54,048 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. కామర్స్‌లో 22,328, ఫిజికల్ సైన్స్‌లో 12,211 మంది, లైఫ్ సైన్స్ 10,435, ఆర్ట్స్ కోర్సుల్లో 8,979 మంది సీట్లు పొందారు. వీరంతా ఈనెల 8లోపు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని అధికారులు సూచించారు. ఈ ఏడాది మొత్తం 1.97 లక్షల మంది డిగ్రీ ఫస్టియర్ అడ్మిషన్లు పొందారని తెలిపారు.