News March 23, 2024
10 జట్లకు రోహితే కెప్టెన్: రైనా

IPLలో పాల్గొనే 10 జట్లకు రోహిత్ శర్మే కెప్టెన్ అని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అన్నారు. ఈ సీజన్లో ముంబైకి సారథిగా లేనప్పటికీ.. టీ20 ప్రపంచకప్ దృష్ట్యా అన్ని జట్లకు అతడే నాయకుడని అభిప్రాయపడ్డారు. ‘రోహిత్ శర్మ దేశంలో ఎక్కడికి వెళ్లినా బలమైన అభిమాన సైన్యం ఉంటుంది. 2 నెలల తర్వాత ఈ 10 ఐపీఎల్ జట్ల నుంచే ప్రపంచకప్ కోసం టీంను ఎంచుకోవాలని అతడికి తెలుసు. కాబట్టి అతను కెప్టెన్ కాదని చెప్పలేం’ అని తెలిపారు.
Similar News
News September 14, 2025
ఇతర భాషలకు హిందీ శత్రువు కాదు.. మిత్రుడు: అమిత్ షా

దేశంలో హిందీ భాషను ఇతర భాషలకు ముప్పుగా చూడొద్దని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. హిందీ ఇతర భాషలకు శత్రువు కాదని, మిత్రుడు అని హిందీ దివస్ కార్యక్రమంలో ఆయన చెప్పారు. ‘ఇందుకు గుజరాత్ పెద్ద ఉదాహరణ. ఇక్కడ గుజరాతీ మాట్లాడిన గాంధీ, దయానంద, వల్లభాయ్ పటేల్, KM మున్షి వంటి ఉద్ధండులు హిందీని ప్రోత్సహించారు. వందేమాతరం, జైహింద్ లాంటి నినాదాలు భాషా మేల్కొలుపు నుంచే ఉద్భవించాయి’ అని వ్యాఖ్యానించారు.
News September 14, 2025
ఇవాళ మ్యాచ్ ఆడకపోతే..

బాయ్‌కాట్ <<17706244>>డిమాండ్<<>> నేపథ్యంలో ఆసియాకప్‌లో ఇవాళ PAKతో టీమ్ ఇండియా ఆడకపోతే తర్వాతి మ్యాచులో (Vs ఒమన్‌తో) తప్పక గెలవాలి. గ్రూపులోని మిగతా జట్ల ప్రదర్శన ఆధారంగా సూర్య సేన సూపర్-4కు చేరనుంది. అయితే పాక్ కూడా వచ్చి, భారత్ బాయ్‌కాట్ కొనసాగిస్తే మిగతా 2 మ్యాచులు గెలవాలి. ఒకవేళ భారత్, పాక్ ఫైనల్ చేరితే ఆ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తే టోర్నీ దాయాది సొంతం అవుతుంది. వేరే జట్టు ఫైనల్ వస్తే అమీతుమీ తేల్చుకోవాలి.
News September 14, 2025
బీజేపీలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్సీ

AP: మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత BJPలో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. ఏడాది క్రితం YCPకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సునీత ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. TDP ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆమె 2017లో MLCగా ఎన్నికయ్యారు. ఆ పార్టీకి రాజీనామా చేసి 2020లో వైసీపీలో చేరి మరోసారి ఎమ్మెల్సీ అయ్యారు. పరిటాల రవి ముఖ్య అనుచరుడు పోతుల సురేశ్ ఈమె భర్త.