News October 26, 2025

వరల్డ్ కప్ ఆడటమే రోహిత్ లక్ష్యం: కోచ్

image

స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రచారాన్ని అతడి చిన్ననాటి కోచ్ దినేశ్ లాడ్ కొట్టిపారేశారు. హిట్‌మ్యాన్ ఫ్యాన్స్‌కు గు‌డ్‌న్యూస్ చెప్పారు. 2027 వరల్డ్ కప్ వరకు ఆడటమే రోహిత్ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆ తర్వాతే రిటైర్ అవ్వాలని నిశ్చయించుకున్నారని తెలిపారు. మరోవైపు AUSలో చివరి మ్యాచ్ ఆడేశానంటూ రోహిత్ SMలో పోస్ట్ చేశారు. ‘వన్ లాస్ట్ టైమ్.. సైనింగ్ ఆఫ్ ఫ్రం సిడ్నీ’ అని క్యాప్షన్ ఇచ్చారు.

Similar News

News February 10, 2026

విజయవాడ ‘మెట్రో’ సంగతేంటి?

image

AP: విశాఖ మెట్రోకు కేంద్రం <<19100784>>గ్రీన్‌సిగ్నల్<<>> ఇచ్చిందనే వార్తల నేపథ్యంలో విజయవాడ మెట్రో సంగతి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ 2 నగరాల్లో మెట్రోలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. అమరావతికి అతిచేరువలోని విజయవాడకు మెట్రో వస్తే రాజధాని రూపురేఖలు మారుతాయనే అభిప్రాయాలున్నాయి. ఈ క్రమంలో విశాఖకే అనుమతిచ్చి VJAను పక్కనపెట్టడానికి కారణాలు ఏమై ఉంటాయనే చర్చ జరుగుతోంది.

News February 10, 2026

శ్రీశైలం మల్లన్న దర్శనానికి 4 గంటలు

image

AP: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు శ్రీశైల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మంగళవారం 12pm వరకు 32,870 మందికిపైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 14,280మంది కాలినడకన ఆలయానికి చేరుకున్నారు. 12,931మంది శివస్వాములు స్పర్శ దర్శనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పెరిగిన రద్దీ కారణంగా మల్లన్న దర్శనానికి 4గంటల టైమ్ పడుతోంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.

News February 10, 2026

రాహుల్ చూపించిన ఆ బుక్‌లో ఏముంది..?

image

MM నరవణె బుక్‌లోని ‘గల్వాన్ దాడి’ గురించి CARAVAN మ్యాగజైన్ పోస్ట్ చేసింది. ఆ కథనం ప్రకారం ‘చైనా సేన మన స్థావరాలకు 1km దూరంలో మోహరించింది. కానీ స్పష్టమైన ఆదేశాల్లేకుండా కాల్పులు చేయొద్దని ఢిల్లీ నిబంధన. దీంతో రక్షణ మంత్రి, NSA, MEAలకు ఫోన్లో విషయం చెప్పా. కాసేపటికి DM ఫోన్ చేసి మోదీతో మాట్లాడా ‘ఏది మంచిదన్పిస్తే అది చేయండి’ అన్నట్లు చెప్పారు. దీంతో PMకు స్పష్టత లేదు అన్పించింది’ అని MM భావించారట.