News June 26, 2024

రోహిత్‌ ‘పైసా వసూల్’ పర్ఫార్మర్: సెహ్వాగ్

image

టికెట్ కొని క్రికెట్ చూడాల్సి వస్తే, అది రోహిత్ కోసమేనని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు. టీమ్ ఇండియా కెప్టెన్ పైసా వసూల్ పర్ఫార్మర్ అని, ఆ టికెట్ డబ్బులకు ఆయన న్యాయం చేస్తారని చెప్పారు. ఆస్ట్రేలియాపై రియల్ రోహిత్ శర్మను చూశానని, ప్రపంచకప్పుల్లో ఇలాంటి ఎంటర్టైనింగ్ బ్యాటింగ్ తానెప్పుడూ చూడలేదన్నారు వీరేంద్రుడు.

Similar News

News April 4, 2026

వాషింగ్టన్ మేయర్ రేసులో భారత సంతతి మహిళ

image

US రాజధాని వాషింగ్టన్ డీసీ మేయర్ రేసులో భారత సంతతికి చెందిన రినీ సంపత్(31) దూసుకెళ్తున్నారు. ఈ ఎన్నికల బరిలో నిలిచిన తొలి దక్షిణాసియా మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. అర్హత సాధించడానికి రినీ దాఖలు చేసిన పిటిషన్‌పై 4,500 మందికి పైగా సంతకాలు చేశారు. తమిళనాడులో జన్మించిన ఆమె ఏడో ఏట పేరెంట్స్‌తో కలిసి USకు వెళ్లారు. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో ఇంటర్నేషనల్ రిలేషన్స్&సెక్యూరిటీలో పట్టా పొందారు.

News April 4, 2026

ఆస్ట్రేలియాకు తిరిగెళ్లిన కమిన్స్.. SRHలో చేరిక మరింత ఆలస్యం!

image

బ్యాటింగ్‌లో అదరగొడుతున్న SRH స్పెషలిస్ట్ బౌలర్లు లేక ఇబ్బంది పడుతోంది. ఈ క్రమంలో ఆ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. టీమ్‌లో చేరినప్పటికీ వెన్నునొప్పి నుంచి కోలుకుంటున్న పాట్ కమిన్స్ మ్యాచ్‌లు ఆడట్లేదు. తాజాగా ఫైనల్ మెడికల్ స్కాన్ కోసం ఆయన ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లారు. ఆ దేశ క్రికెట్ బోర్డు అనుమతిస్తే ఈ నెల 17న భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. లేదంటే మరింత ఆలస్యం కానుంది.

News April 4, 2026

‘అశ్వత్థామ హతః’ అర్థం ఇదే!

image

సగం నిజం, సగం అబద్ధం చెబుతున్నప్పుడు ఈ నానుడిని వాడతాం. భారతంలో ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థామ. కురుక్షేత్రంలో ద్రోణుడు పాండవులపై భీకరంగా విరుచుకుపడుతుంటారు. ఆయనను అడ్డుకోవడానికి కృష్ణుడు ఉపాయం వేస్తారు. ధర్మరాజు చేత ‘అశ్వత్థామ హతః’ అని గట్టిగా, కుంజరహ:(ఏనుగు) అని చిన్నగా చెప్పిస్తారు. దీంతో తన కొడుకే చనిపోయాడనే బాధతో ద్రోణుడు అస్త్ర సన్యాసం చేయగానే ధృష్టద్యుమ్నుడు ఆయనను సంహరిస్తారు.<<-se>>#EPICSAYINGS<<>>