News March 9, 2025

రోహిత్ రిటైర్మెంట్ వార్తలు.. గంగూలీ ఏమన్నారంటే?

image

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత రోహిత్ శర్మ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తారని వస్తున్న వార్తలపై భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ స్పందించారు. ‘ఈ చర్చ అవసరం ఏముంది? కొద్ది నెలల క్రితమే అతడు దేశానికి వరల్డ్ కప్ అందించారు. బాగా ఆడుతున్నాడు. సెలక్టర్లు ఏమి ఆలోచిస్తున్నారో నాకైతే తెలియదు. 2027 వన్డే WCలోనూ రోహిత్ ఆడితే బాగుంటుంది. గత మ్యాచ్ ప్రదర్శనే రిపీట్ చేస్తే ఇవాళ కప్ మనదే’ అని వెల్లడించారు.

Similar News

News March 5, 2026

అభిషేక్ మరోసారి ఫెయిల్

image

T20WCలో టీమ్ ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి ఫెయిల్ అయ్యారు. కీలకమైన సెమీఫైనల్లో రెండో ఓవర్లోనే భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఇచ్చారు. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్ పైనా నిర్లక్ష్యపు షాట్ ఆడి 9 పరుగులకే ఔట్ కావడంపై ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. ఫైనల్‌కు వెళ్తే అతడిని పక్కన పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ WCలో అభి 7 మ్యాచులు ఆడి 89 రన్స్ మాత్రమే చేశారు.

News March 5, 2026

టెన్త్ విద్యార్థులకు శుభవార్త.. హాల్ టికెట్ చూపిస్తే ఫ్రీ జర్నీ

image

AP: టెన్త్ విద్యార్థులకు APSRTC శుభవార్త చెప్పింది. హాల్‌టికెట్లను కండక్టర్లకు చూపిస్తే ఈ నెల 16 నుంచి APR 1 వరకు పరీక్షా కేంద్రాలకు, ఇంటికి ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు ప్రకటించింది. ‘పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. విద్యార్థులను ఎక్కించుకోకుండా వెళితే సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు నడుపుతాం’ అని పేర్కొంది.

News March 5, 2026

X-RAY లేని కాలంలో గర్భస్థ శిశువుపై శిల్పాలు!

image

కేరళంలోని త్రిశూర్‌లో ఉన్న వడుగనాథ స్వామి ఆలయం భారతీయ శిల్పకళా చాతుర్యానికి, అప్పటి శాస్త్ర విజ్ఞానానికి సజీవ సాక్ష్యం. 2000 ఏళ్ల క్రితం ఎక్స్-రే, స్కానింగ్ వంటి ఆధునిక పరికరాలు లేని కాలంలోనే గర్భంలోని శిశువు నెలవారీ ఎదుగుదల భంగిమలను కళ్లకు కట్టినట్లు చెక్కారు. నిజంగా మన పూర్వీకులకు గర్భస్థ శిశువుపై ఉన్న పరిజ్ఞానం ఎంత గొప్పదో కదా! ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో- వంద వింతలు’లో..