News August 6, 2024

యూరప్ ట్రిప్‌లో రోజా.. ఫొటో వైరల్!

image

AP మాజీ మంత్రి రోజా యూరప్‌ పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆమె ఇటలీలో ఉన్నారంటూ రోజా ఫొటోను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన రోజా.. నగరి MLAగా ఓడిపోవడంతో పాటు YCP అధికారం కోల్పోవడంతో కాస్త సైలెంట్ అయ్యారు. అయితే రాష్ట్రంలో YCP శ్రేణులపై దాడులు జరుగుతుంటే అండగా ఉండాల్సింది పోయి విదేశాల్లో ఎంజాయ్ చేస్తారా? అని సొంత పార్టీ నేతలే ఆమెపై గుర్రుగా ఉన్నారట.

Similar News

News February 7, 2026

క్రేజీ టైటిల్‌తో తరుణ్ భాస్కర్ మూవీ

image

ఈ నగరానికి ఏమైంది(ENE) సినిమాతో దర్శకుడు తరుణ్ భాస్కర్‌కు యూత్‌లో ఫుల్ ఫాలోయింగ్ పెరిగింది. తర్వాత ‘కీడా కోలా’ చేసినా అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యారు. దర్శకుడిగా చేస్తూనే నటుడిగానూ ప్రూవ్ చేసుకుంటున్నారు. ‘ENE2’ మూవీ చేస్తున్న తరుణ్ హీరోగా ఓ సినిమాను మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీకి టైటిల్‌ను క్రేజీ డైలాగ్ ‘గాయపడ్డ సింహం’గా ఫిక్స్ చేసినట్లు తెలిపారు. 9న టీజర్ విడుదల కానుందని పేర్కొన్నారు.

News February 7, 2026

అర్ధరాత్రి బిహార్ ఎంపీ అరెస్ట్

image

నాటకీయ పరిణామాల నడుమ బిహార్ ఎంపీ పప్పూ యాదవ్(రాజేశ్ రంజన్) అరెస్టయ్యారు. 1995 డాక్యుమెంట్ ఫోర్జరీ కేసులో ఆయనను అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఆయన పోలీసులతో అరెస్టుకు వారెంట్ లేదని వాగ్వాదానికి దిగారు. ఇవాళ ఆయనను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశముంది. ఢిల్లీ నుంచి పాట్నాలోని ఇంటికి చేరిన గంటలోపే పప్పూను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్ణియా లోక్‌సభ నియోజకవర్గం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

News February 7, 2026

బాలీవుడ్‌లో 90% పెళ్లిళ్లు ఫేక్: ‘హిట్-3’ నటుడు

image

బాలీవుడ్‌లో 90శాతం పెళ్లిళ్లు ఫేక్ అని ‘హిట్-3’ నటుడు ప్రతీక్ స్మిత పాటిల్ అన్నారు. ‘ప్రజలకు వాస్తవం ఏంటో తెలియదు. ఇండస్ట్రీలోని వారికే నిజాలు తెలుసు. ఏదో ఒక రోజు ఈ అంశాలు కథగా లేదా పుస్తక రూపంలో లేదా సినిమాగా రావచ్చు. ఒకరినొకరు మోసగించుకోవడం, పలువురితో సంబంధం కలిగి ఉండటం ఇక్కడ ఫ్యాషన్‌గా మారింది. పెళ్లి అంటే ఒక జోక్ అయింది’ అని భార్య ప్రియా బెనర్జీతో కలిసి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.