News November 21, 2024
రోజాను జైలుకు పంపిస్తాం: శాప్ ఛైర్మన్ రవినాయుడు
AP: వైసీపీ హయాంలో ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో ఆర్కే రోజా రూ.వేల కోట్ల ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారని శాప్ ఛైర్మన్ రవినాయుడు ఆరోపించారు. ఓట్ల కోసం 17 ఏళ్లు పైబడిన వారికే క్రీడల్లో అవకాశం కల్పించారని విమర్శించారు. ఆమె పెద్ద అవినీతి తిమింగలమన్నారు. తిరుమల దర్శనాల విషయంలోనూ దోపిడీకి పాల్పడ్డారని చెప్పారు. ఈ రెండు అంశాలపై సీఐడీ విచారణ చేయిస్తామని, కచ్చితంగా ఆమెను జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు.
Similar News
News November 21, 2024
రేణూ దేశాయ్ తల్లి కన్నుమూత
సినీ నటి రేణూ దేశాయ్ తల్లి కన్నుమూశారు. ఈ విషయాన్ని రేణు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తన తల్లి ఫొటో షేర్ చేసి ఓం శాంతి అంటూ పోస్ట్ చేశారు. దీంతో రేణును నెటిజన్లు ఓదారుస్తున్నారు. ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలని ఆమెకు సూచిస్తున్నారు.
News November 21, 2024
29న రాష్ట్రవ్యాప్తంగా BRS దీక్షా దివస్: KTR
TG: ఈ నెల 29న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కరీంనగర్‌లో జరిగే దీక్షా దివస్‌లో తాను పాల్గొంటానని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 2009 నవంబర్ 29న తెలంగాణ కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన రోజు కావడంతో దీక్షా దివస్ నిర్వహిస్తున్నట్లు వివరించారు.
News November 21, 2024
చైనా మాస్టర్స్‌లో పీవీ సింధు ఓటమి
భారత షట్లర్లు పీవీ సింధు, అనుపమ ఉపాధ్యాయ చైనా మాస్టర్స్ టోర్నీలో రెండో రౌండ్లో వెనుదిరిగారు. సింగపూర్‌కు చెందిన యెవో జియా మిన్ చేతిలో సింధు 16-21, 21-17, 21-23 తేడాతో ఓడిపోగా అనుపమ జపాన్ క్రీడాకారిణి నత్సుకీ నిడైరాతో 21-7, 21-14 తేడాతో ఓటమిపాలయ్యారు. సింధు ఈ ఏడాది వరుసగా 7 టోర్నమెంట్లలో క్వార్టర్ ఫైనల్ కూడా దాటకపోవడం గమనార్హం.