News July 30, 2024
త్వరలో ‘దేవర’ నుంచి రొమాంటిక్ మెలోడీ!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ‘దేవర’ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ కానుంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ‘దేవర’ అని ట్వీట్ చేయగా అతి త్వరలోనే అని టీమ్ దానికి రిప్లై ఇచ్చింది. ఈ సాంగ్ రొమాంటిక్ మెలోడీగా ఉంటుందని సమాచారం. ఇప్పటికే రిలీజైన ఫియర్ సాంగ్ సినిమాపై అంచనాలు పెంచేసిన విషయం తెలిసిందే. కాగా సెప్టెంబర్ 27న ‘దేవర’ రిలీజ్ కానుంది.
Similar News
News January 5, 2026
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.1,580 పెరిగి రూ.1,37,400కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,450 ఎగబాకి రూ.1,25,950 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.8,000 పెరిగి రూ.2,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News January 5, 2026
వెనిజులా అధ్యక్షుడి అరెస్ట్.. ఇండియాపై ఎఫెక్ట్ ఎంత?

అమెరికా దళాలు వెనిజులా అధ్యక్షుడు మదురోను అరెస్ట్ చేయడం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అయితే దీనివల్ల మన దేశానికి వచ్చే నష్టం ఏమీ లేదని GTRI రిపోర్ట్ చెప్తోంది. ఒకప్పుడు మనం అక్కడి నుంచి భారీగా ముడి చమురు కొనేవాళ్లం. కానీ అమెరికా ఆంక్షల వల్ల 2020 నుంచి అది బాగా తగ్గిపోయింది. అందుకే అక్కడి గొడవలు మన ఎకానమీ లేదా ఎనర్జీ సెక్యూరిటీపై పెద్దగా ప్రభావం చూపించవని GTRI తెలిపింది.
News January 5, 2026
తండ్రైన క్రికెటర్ అంబటి రాయుడు

తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు తండ్రయ్యారు. ఆయన భార్య విద్య మగ పిల్లాడికి జన్మనిచ్చారు. వారిద్దరితో దిగిన సెల్ఫీ ఫొటోను రాయుడు ఇన్స్టాలో పోస్ట్ చేశారు. కాగా విద్యను రాయుడు 2009లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన పలు లీగుల్లో ఆడుతూ క్రికెట్ కామెంటరీ కూడా చేస్తున్నారు.


