News July 6, 2024
యూరో ఛాంపియన్షిప్ నుంచి రొనాల్డో టీమ్ ఔట్

యూరో ఛాంపియన్షిప్ క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచులో రొనాల్డో టీమ్ పోర్చుగల్ ఓటమి పాలైంది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు ఒక్క గోల్ నమోదు చేయకపోవడంతో పెనాల్టీ షూటౌట్ నిర్వహించగా 5-3 తేడాతో ఫ్రాన్స్ సెమీస్‌కు దూసుకెళ్లింది. అంతకుముందు ఆతిథ్య జర్మనీతో జరిగిన మ్యాచులో 2-1 తేడాతో స్పెయిన్ విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు చెరో గోల్ చేయడంతో అదనపు సమయం కేటాయించగా స్పెయిన్ గెలుపొందింది.
Similar News
News January 31, 2026
సెంచరీతో చెలరేగిన ఇ’షాన్’

NZతో జరుగుతున్న చివరి టీ20లో భారత బ్యాటర్ ఇషాన్ కిషన్ అదరగొట్టారు. కేవలం 42 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నారు. 10 సిక్సర్లు, 6 ఫోర్లతో కివీస్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. మరోవైపు సూర్య 30 బంతుల్లో 63 పరుగులు చేసి ఔటయ్యారు. ఈ ఇన్నింగ్సుతో ఇషాన్ అంతర్జాతీయ టీ20ల్లో 1,000 రన్స్ పూర్తి చేసుకున్నారు.
News January 31, 2026
13 ఏళ్ల అమ్మాయిపై రేప్.. ట్రంప్‌పై సంచలన ఆరోపణలు!

అమెరికాలో బయటపడుతున్న <<19009352>>ఎప్స్టీన్ ఫైల్స్<<>> దుమారం రేపుతున్నాయి. 13 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేశారని ట్రంప్ ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు ప్రభుత్వ డాక్యుమెంట్లలో ఉండటం సంచలనంగా మారింది. నవజాత శిశువు హత్యలోనూ ఆయన ప్రమేయం ఉందని పేర్కొనడం గమనార్హం. ఈ డాక్యుమెంట్లను రిలీజ్ చేసిన కాసేపటికే డిలీట్ చేసి, మళ్లీ సైట్లో పెట్టినట్లు తెలుస్తోంది. ట్రంప్‌పై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని వైట్‌హౌస్ చెప్పింది.
News January 31, 2026
సూర్య సూపర్ రికార్డు

టీమ్ ఇండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అరుదైన రికార్డు సృష్టించారు. T20Iలలో అత్యంత వేగంగా(1,822 బంతులు) 3000 పరుగులు పూర్తిచేసిన ఆటగాడిగా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో మహ్మద్ వసీమ్(1,947 B), బట్లర్(2,068 B), ఫించ్(2,077 B), వార్నర్(2,113 B), రోహిత్ శర్మ(2,149 B), విరాట్ కోహ్లీ(2,169 B) ఉన్నారు. కాగా ఇవాళ సూర్య కివీస్‌పై 30 బంతుల్లోనే 63 రన్స్ చేసి ఔటయ్యారు. ఇందులో 6 సిక్సులు, 4 ఫోర్లు ఉన్నాయి.


