News November 29, 2024

ఆశ్రమ పాఠశాలలో కుళ్లిన గుడ్లు, బంగాళదుంపలు

image

TG: ప్రభుత్వ స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ ఆశ్రమ పాఠశాలలో తనిఖీలు చేయగా కుళ్లిన గుడ్లు, ఆలుగడ్డలు కనిపించాయి. పప్పునకు బదులు సాంబార్ వండారని, ఉప్పు ప్యాకెట్లపై ISI మార్క్ లేదని గుర్తించారు. విద్యార్థులకు బ్లాంకెట్లు, యూనిఫామ్‌ ఇంకా అందలేదని తెలియడంతో వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News November 29, 2024

మోదీ VS దీదీ: చల్లబడ్డ ‘ఫైర్’ బ్రాండ్!

image

ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం, బంగ్లా అల్లర్ల తర్వాత బెంగాల్ CM మమతా బెనర్జీ పంథా మార్చుకున్నట్టు కనిపిస్తోంది. మునుపటిలా కేంద్రం, PM మోదీపై విరుచుకుపడటం లేదు. అంశాలవారీగా మద్దతిస్తున్నారు. మొదట్లో బంగ్లా సంబంధాలపై నాలుక్కర్చుకున్న ఆమె ఆ తర్వాత కేంద్ర వైఖరినే అనుసరిస్తున్నారు. అక్కడి హిందువులపై సానుభూతి చూపుతున్నారు. INDIA కూటమి అదానీ అంశంపై పార్లమెంటును అడ్డుకోవద్దని చెప్పడం విశేషం.

News November 29, 2024

PM వెళ్లి బిర్యానీ తినొచ్చు కానీ టీమ్ ఇండియా వెళ్లొద్దా?: తేజస్వీ

image

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం క్రికెట్ జట్టును పాకిస్థాన్‌కు భారత్ పంపకపోవడంపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మండిపడ్డారు. క్రీడల్లో రాజకీయాలుండకూడదని పేర్కొన్నారు. ‘పాక్ ఆటగాళ్లు మన దేశానికి రావాలి. మన వాళ్లు అక్కడికి వెళ్లాలి. క్రీడల్లో యుద్ధమేం జరగడం లేదు కదా? పీఎం మోదీ పాకిస్థాన్ వెళ్లి బిర్యానీ తిన్నప్పుడు లేని అభ్యంతరం, మన జట్టును అక్కడికి పంపించడానికెందుకు?’ అని ప్రశ్నించారు.

News November 29, 2024

రైతుబంధు కంటే బోనస్ బాగుందంటున్నారు: తుమ్మల

image

TG: రైతుబంధుపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుబంధు కంటే సన్నవడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ బాగుందని రైతులు అంటున్నారని ఆయన చెప్పారు. ఒక్కో రైతుకు దాదాపు రూ.15వేల వరకు బోనస్ వస్తోందన్నారు. ఈ రెండింట్లో రైతుకు ఏది మేలు అనిపిస్తే అదే అమలు చేస్తామన్నారు. ఈరోజు ఉదయం సీఎం రేవంత్ సైతం ఇదే <<14740821>>అభిప్రాయం<<>> వ్యక్తం చేశారు.